35 BRS Leaders To Join Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయా ? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదుల సంఖ్యలో నేతలు ఇతర పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? మరీ ముఖ్యంగా ఒక్క కాంగ్రెస్ పార్టీలోకే 35 మంది బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోందా ? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికొచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావులు ఇందుకోసం ఇప్పటి నుంచే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ చురుగ్గా పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఇద్దరూ కలిసి తెలంగాణ ముఖ్య నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గె, రాహుల్ గాంధీలను కలిసిన సంగతి తెలిసిందే. జూలై మొదటి వారంలో ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుండగా.. ఈ సభలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు తమ అనుచరగణంతో, తమతో కలిసొచ్చే నేతలతో వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తాజాగా ఎన్డీటీవీ ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో.. అంటే సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా దాదాపు 35 మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. 


ఇప్పటికే పదవులు దక్కలేదనే ఆగ్రహం కావొచ్చు లేదా పార్టీలో సరైన ప్రాధాన్యత లేదనే అసంతృప్తి కావొచ్చు.. బీఆర్ఎస్ పార్టీకే చెందిన వివిధ సామాజికవర్గాలకు చెందిన ఎంతోమంది నేతలు తమ సొంత పార్టీపైనే గుర్రుగా ఉన్నారు. ఇంకొంత మంది బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత తమపై ప్రభావం చూపించకముందే ఇక్కడి నుంచి తట్టాబుట్టా సర్దేసుకుంటే రాజకీయంగా తమ భవిష్యత్ బాగుంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్టుగానూ ప్రచారం జరుగుతోంది. వీళ్లలో చాలామందికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కే అవకాశం కూడా తక్కువే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకే అక్కడే ఉండి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కంటే.. భవిష్యత్ ఉండే పార్టీలవైపు అడుగులేయడం బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్టు వినికిడి. 


ఇది కూడా చదవండి : Rythu Bandhu Money will Credited Today: నేటి నుంచే ఖాతాల్లో రైతు బంధు పథకం జూన్ 2023 డబ్బులు! అకౌంట్లో చెక్ చేసుకోండి!


తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 లో తొలిసారిగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకుగాను బీఆర్ఎస్ పార్టీ 63 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తరువాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగి ఈసారి ఏకంగా 88 స్థానాలు కైసవం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలంగాణలో ముచ్చటగా మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది అనే చర్చే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


ఇది కూడా చదవండి : Revanth Reddy: దోచుకున్న సొమ్ముతో కేసీఆర్ అక్కడికే పారిపోతారు.. రేవంత్ రెడ్డి సెటైర్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK