Woman gang rape in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. 35 ఏళ్ల ఓ మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. ఆటో ఎక్కిన ఆ మహిళను.. దింపాల్సిన చోట కాకుండా డ్రైవర్ మరో చోటుకు తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ (35) గురువారం (మార్చి 25) కోఠి వెళ్లారు. అక్కడ పని ముగించకున్న తర్వాత కోఠి బస్టాండ్‌లో బస్ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. ఇంతలో ఓ ఆటో డ్రైవర్ అక్కడికి వచ్చి.. ఎక్కడికి వెళ్లాలని ఆమెను అడిగాడు. జూబ్లీహిల్స్ అని చెప్పడంతో.. తాను అటువైపే వెళ్తున్నానని... ఆటో ఎక్కితే దింపుతానని చెప్పాడు. దీంతో ఆ మహిళ ఆటో ఎక్కింది.


సదరు ఆటో డ్రైవర్ ఆమెను జూబ్లీహిల్స్ వైపు కాకుండా మరోవైపు తీసుకెళ్లాడు. చాలాసేపు వివిధ మార్గాల్లో తిప్పి చివరకు గాయత్రినగర్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే తన ముగ్గురు స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారమివ్వడంతో.. గాయత్రినగర్‌లో ఆ ముగ్గురు సిద్దంగా ఉన్నారు. అక్కడికి చేరుకున్నాక మహిళను బలవంతంగా లాక్కెళ్లి నలుగురు కలిసి గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పారిపోయారు. బాధితురాలు మీర్‌పేట పోలీసులను ఆశ్రయించి నిందితులపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఆ ఆటో డ్రైవర్‌ను కర్మన్‌ఘాట్‌కి చెందిన అఖిల్‌గా గుర్తించారు. అతనితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలుస్తోంది.


Also read: Flipkart mobile fest: ఫ్లిప్​కార్ట్ మంత్​ ఎండ్ మొబైల్ సేల్​.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!


Also read: Realme C31: రియల్​మీ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook