హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన (Lockdown) లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం నాడు కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జీహెచ్ఎంసీ పరిధిలో 33 కేసులు నమోదు కాగా వలస వచ్చిన వారి నుండి 19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి వచ్చిన వారు 14 మంది ఉండగా, కువైట్ నుంచి వచ్చిన వారిలో నలుగురికి కోవిడ్ పాజిటివ్ అని తేలిందన్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1813కి చేరగా మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. శనివారం 25 మంది కరోనా ఆరి నుండి నుండి కోలుకోగా మొత్తం 1068 మంది కరోనా నుండి కోలుకొని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 696 యాక్టివ్ కేసులు ఉన్నాయని, తెలంగాణలో కోవిడ్ బారిన పడిన వారిలో 59 శాతం మంది డిశ్చార్జ్ అయిన వారు ఉండగా 3 శాతం మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: COVID-19: కరోనాతో ఢిల్లీకి చెందిన సీనియర్ వైద్యుడు మృతి..


మరోవైపు కేరళలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పూర్తిగా తగ్గి మళ్లీ పెరుగుతుండడంతో ఆందోళన కలిగించే అంశం. శనివారం నాడు కొత్తగా 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 275కి పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 515మంది కోలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్య శాఖ వెల్లడించింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..