న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లోని ఒక సీనియర్ వైద్యుడు డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే COVID-19 తో శనివారం మరణించాడు. 78 ఏళ్ల డాక్టర్ జితేంద్ర నాథ్ పాండే ప్రీమియర్ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగానికి డైరెక్టర్, ప్రొఫెసర్‌గా పనిచేశారు. గత్ కొన్ని వారాల నుండి కరోనావైరస్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. వైద్య వృత్తిలో ఆయన అపారమైన అనుభవం కలిగినవారని ఆమె ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
Also Read: Telagana: ప్రవేశ పరీక్షల తేదీల విడుదల..
డాక్టర్ సంగీత రెడ్డి స్పందిస్తూ పల్మనాలజీ డిపార్ట్ మెంట్ హెడ్ అయిన డాక్టర్ పాండే మృతిని ధృవీకరించారు. ఆయన మరణాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని, వైద్య వృత్తిలో ఆయన అపారమైన అనుభవం కలిగినవారని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఎయిమ్స్ వద్ద ఒక మెస్ వర్కర్ ఈ వ్యాధితో మరణించిన ఒక రోజు తర్వాత డాక్టర్ పాండే మరణించారు. అయితే గత నెలలో వైద్యులు నర్సింగ్ సిబ్బంది కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన తరువాత హిందూ రావు, బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ హాస్పిటల్, ఢిల్లీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వంటి ఆసుపత్రులను మూసివేయవల్సి వచ్చింది.
కాగా ఢిల్లీలో (Delhi) ఇప్పటివరకు 12,319 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 208 మరణాలు సంభవించాయని అధికారికంగా వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తరువాత దేశంలో అత్యధికంగా కరోనా విజృంభిస్తోన్న రాష్ట్రం ఢిల్లీ. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..