8th Class Student argues with Traffic Police in Siddipet: ఈ మధ్య కాలంలో చాలామంది స్కూల్ పిల్లలు (Students) వాహనాలు నడుపుతున్న విషయం తెలిసిందే. కొందరు అయితే హైవే పైన కూడా స్కూటీ, బైక్, కార్‌లను చాలా స్పీడ్‌గా నడుపుతూ దూసుకెళుతున్నారు. డ్రైవ్ చేస్తూ ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులకు (Traffic Police) దొరికితే.. వారు వింతవింత సమాధానాలు చెపుతున్నారు. వారు చెప్పే సమాధానాలకు ట్రాఫిక్ పోలీసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే తాజాగా ఓ 8వ తరగతి విద్యార్ధి నన్నే పట్టుకుంటావా అని ట్రాఫిక్ పోలీసులనే బెదిరించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సిద్దిపేట (Siddipet) ట్రాఫిక్ పోలీసులు తాజాగా పాత బస్టాండ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. స్కూటీపై బ్యాగులు వేసుకొని పాఠశాల నుంచి ఇంటికి వెళుతున్న ఓ బాలుడు వారికి కనిపించాడు. పోలీసులు బాలుడిని ఆపి.. వివరాలు అడగ్గా శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి (8th Class Student) చదువుతున్నాను అని బదులిచ్చాడు. నువ్వు స్టూడెంట్ కదా, స్కూటీ వేసుకొని ఎక్కడకు వెళ్తున్నావు అని పోలీసులు ప్రశ్నించగా.. రోజూ బండి మీదే స్కూల్‎కు వెళ్తానని చెప్పాడు. ఈ బండి నడపడానికి లైసెన్స్ (Driving License) అవసరం లేదని, మీరు నన్ను ఇలా ఆపకూడదని కూడా ఆ విద్యార్ధి అన్నాడు. 


Also Read: Seerat Kapoor Size Zero: అరె పాపం.. శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?


ట్రాఫిక్ పోలీసులు ఆ బాలుడిని గట్టిగా మందలించగా.. 'మా నాన్న ఎంపీటీసీ, నన్నే ఆపుతారా' అంటూ ఎదురు ప్రశ్నించాడు. బాలుడి సమాధానం విన్న పోలీసులు.. ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే బాలుడి తండ్రికి ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలకు బండి ఇవ్వకూడదని వార్నింగ్ ఇచ్చారు. లైసెన్స్ లేకుండా బండి నడపాలని ఏ చట్టంలో లేదని.. ఎంపీటీసీ, ఎమ్మెల్యే, సీఎం ఎవరైనా  మాకు ఒకటే అని చెప్పారు. మరోసారి ఇది రిపీట్ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు బాలుడి తండ్రిని హెచ్చరించారు. అనంతరం బాలుడి కుటుంబసభ్యులకు స్కూటీని అప్పగించి పంపించారు. ప్రస్తుతం బాలుడికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


Also Read: Mahesh Babu - Rashmika: మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు.. మహేష్ బాబుపై విమర్శల వర్షం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.