Mahesh Babu - Rashmika: మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు.. మహేష్ బాబుపై విమర్శల వర్షం!!

పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మికను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసించలేదు. దాంతో నేషనల్ క్రష్‌ రష్మిక ఫాన్స్ నిరాశ చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 07:33 AM IST
  • పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌
  • రష్మికను మర్చిపోయావ్ ఏంటి బ్రో
  • మహేష్ బాబుపై విమర్శల వర్షం
Mahesh Babu - Rashmika: మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు.. మహేష్ బాబుపై విమర్శల వర్షం!!

 Netizens brutally trolles Mahesh Babu For Not Mentioning Rashmika: క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Sukumar), స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) కాంబినేషనల్‌లో వచ్చిన పాన్‌ ఇండియా సినిమా 'పుష్ప: ది రైజ్‌'.  గతేడాది డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. పుష్ప రిలీజై ఇప్పటికి 20 రోజులు గడుస్తున్నా.. కలెక్షన్ల సునామి మాత్రం అగడం లేదు. పుష్పరాజ్‌గా బన్నీ, శ్రీవల్లిగా రష్మిక ఇద్దరూ అందరిని ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టిన పుష్ప సినిమాపై ఇటీవల 'సూపర్ స్టార్' మహేశ్‌ బాబు (Mahesh Babu) తనదైన శైలిలో ప్రశంసించారు.

పుష్ప సినిమాపై మహేశ్‌ బాబు ట్విటర్‌ వేదికగా ఓ రివ్యూ ఇచ్చారు. 'పుష్పగా అల్లు అర్జున్‌ నటన స్టన్నింగ్‌, ఒరిజినల్‌, సెన్సేషనల్‌గా ఉంది. బన్నీ అద్భుతంగా నటించాడు. తన సినిమాలు ఎంత వాస్తవంగా, పచ్చిగా, నిజాయితీగా ఉంటాయో సుడైరెక్టర్ కుమార్‌ మరోసారి నిరూపించాడు' అని ట్వీట్ చేశారు. అలాగే 'పుష్ప'కు పని చేసిన టెక్నీషియన్ల గురించి మరో ట్వీట్‌ చేసి.. 'దేవి శ్రీ ప్రసాద్‌.. నీ గురించి ఏం చెప్పను. నువ్వో రాక్‌ స్టార్‌వి. మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది' అని సూపర్ స్టార్ రాసుకొచ్చారు. 

Also Read: Viral Food Video: వామ్మో!! కిలో స్వీట్ ధర రూ. 16 వేలా? ఈ మిఠాయికి అంత క్రేజ్ ఎందుకో తెలుసా?

అల్లు అర్జున్‌ను మహేశ్‌ బాబు పొగడడంతో బన్నీ ఫాన్స్ తెగ సంబరపడిపోయారు. అయితే పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆకట్టుకున్న రష్మిక (Rashmika)ను మాత్రం సూపర్ స్టార్ ప్రశంసించలేదు. కనీసం ఆమె పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. దాంతో నేషనల్ క్రష్‌ రష్మిక ఫాన్స్ నిరాశ చెందారు. సోషల్ మీడియాలో మహేశ్‌ బాబుపై విమర్శల వర్షం (Mahesh Babu Trolls) కురిపిస్తున్నారు. 'రష్మికను మర్చిపోయావ్ ఏంటి బ్రో' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు' అని ఇంకొకరు మహేష్ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశారు. 'చాలా నిరాశకు గురయ్యా', 'షాకింగ్‌గా ఉంది' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 2020లో విడుదలైన బ్లాక్‌బస్టర్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్, రష్మిక కలిసి నటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu Corona) కరోనా బారిన పడ్డారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని ట్విటర్‌లో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్ట్‌లు చేసుకోవాలని సూపర్‌ స్టార్‌ (Super Star) సూచించారు. మహేష్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సూపర్‌ స్టార్‌ 'సర్కారువారి పాట' సినిమాతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. 

Also Read: O Antava Song Rehearsal: వీడు నన్ను చంపేశాడు- సమంత సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

  

Trending News