Seerat Kapoor Size Zero: అరె పాపం.. శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?

'రన్‌ రాజా రన్‌' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్‌ సీరత్ కపూర్‌ తాజాగా షేర్‌ చేసిన ఓ ఫోటోలో గుట్టుపట్టలేనంతగా మారిపోయారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2022, 09:15 AM IST
  • శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి
  • పొట్టి డ్రెస్ వేసుకున్న సీరత్ కపూర్‌
  • చిక్కిపోయిన సీరత్ కపూర్‌
Seerat Kapoor Size Zero: అరె పాపం.. శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి?

 Tollywood Actress Seerat Kapoor Size Zero photos goes Viral: 'రన్‌ రాజా రన్‌' చిత్రంతో టాలీవుడ్‌ (Tollywood)కు పరిచయం అయిన హీరోయిన్‌ 'సీరత్ కపూర్‌' (Seerat Kapoor). ఈ సినిమాలో శర్వానంద్‌ (Sharwanand) సరసన నటించి మంచి మార్కులే కొట్టేశారు. ఆ సినిమాలో 'బుజ్జి మా.. బుజ్జి మా' సాంగ్‌ ఆమెకు మంచి పేరు తెచ్చిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శర్వా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సీరత్ కపూర్‌.. ఆ తర్వాత రాజుగారి గది-2, టైగర్, కొలంబస్‌, టచ్‌ చేసి చూడు వంటి సినిమాల్లో నటించారు. అయితే అవన్నీ సెకండ్‌ హీరోయిన్ పాత్రలు కావడంతో ఆశించిన గుర్తింపు రాలేదు. 

కృష్ణ అండ్‌ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా వంటి ఓటీటీ సినిమాలలో కూడా సీరత్ కపూర్‌ నటించారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ కర్లీ హెయిర్‌ భామ సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన గ్లామరస్‌, ఫ్యాషనబుల్‌, హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటున్నారు. అయితే తాజాగా షేర్‌ చేసిన ఓ ఫోటోలో మాత్రం సీరత్‌ గుట్టుపట్టలేనంతగా మారిపోయారు. రన్‌ రాజా రన్‌ చిత్రంలో బొద్దుగా కనిపించిన సీరత్.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయారు. సైజ్‌ జీరోకు (Seerat Kapoor Size Zero) మారిపోయారు. 

Also Read: IND vs SA: అశ్విన్ అరుదైన ఫీట్‌.. రెండో భారత స్పిన్నర్‌గా రికార్డు!!

ట్విటర్‌లో పోస్ట్ చేసిన సీరత్ కపూర్‌ పోటోలను చూసిన ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. పొట్టి డ్రెస్ వేసుకున్న సీరత్ కపూర్‌ కర్లీ హెయిర్‌, క్యూట్‌ లుక్స్‌తో బాగానే ఉన్నా.. మరీ సన్నగా కనిపిస్తున్నారు. దాంతో నెటిజన్లు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అరె పాపం.. శర్వానంద్‌ హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి' అని ఒకరు కామెంట్ చేయగా.. 'ఏమైంది నీకు.. ఇలా తయారయ్యావ్‌' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 'మరీ ఇంతలా సన్నబడాలా సీరత్', 'లుక్ బాగానే ఉన్నా.. మరి ఇంతలా చిక్కిపోయావ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Mahesh Babu - Rashmika: మహిళా ప్రధాన పాత్రను ఎందుకు అగౌరవపరిచారు.. మహేష్ బాబుపై విమర్శల వర్షం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

Trending News