Addanki Dayakar about komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నిక కోసం సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ చండూరులో చేపట్టిన బహిరంగ సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనియాంశమైన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తర్వాత మళ్లీ అంత హైలైట్ అయిన పేరుగా అద్దంకి దయాకర్ వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ సమావేశంలో చర్చ జరిగిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అద్దంకి చేసిన వాఖ్యలు ప్రజల్లో తప్పుడు చర్చకు దారి తీసిన నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని నిర్ణయించాం అని మల్లు రవి స్పష్టంచేశారు. అద్దంకి దయాకర్‌కి షోకాజ్ నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయన సైతం అటు పార్టీకి, ఇటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వివరణ ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని మల్లు రవి తేల్చిచెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయమై అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. సభలో తన వ్యాఖ్యల్లో తప్పు దొర్లిందని.. అది కొంత మందిని అసంతృప్తికి గురిచేసిందని తెలియడంతో నా వాఖ్యలపై మరోసారి పునరాలోచించాం అని అన్నారు. తన వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందున ఆయనకు తాను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నా అని అద్దంకి దయాకర్ ప్రకటించారు. నా వాఖ్యలతో ఇబ్బంది పడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిమానులకు సైతం క్షమాపణ చెబుతున్నా అని అద్దంకి పేర్కొన్నారు. 


కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా తాను పార్టీకి నష్టం చేకూర్చాలని ఎప్పుడు భావించలేదని అద్దంకి దయాకర్ అభిప్రాయపడ్డారు. పార్టీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకోకముందే తాను వివరణ ఇవ్వడానికి సిద్ధపడ్డానని.. కానీ ఆలోపే షోకాజ్ నోటీసులు ఇచ్చారని అన్నారు. ఏదేమైనా మరోసారి తన వల్ల తప్పు జరగకుండా చూసుకుంటా అని అద్దంకి దయాకర్ వివరణ ఇచ్చారు.


చిన్నారెడ్డికి లేఖ అందించిన అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డిని కలిసిన అద్దంకి దయాకర్.. తన వివరణతో కూడిన లేఖను అందజేశారు. చండూర్ సభలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని.. అందుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నానని అద్దంకి దయాకర్ స్పష్టంచేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇవ్వడం మాత్రమే కాదని.. తాను స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కూడా కలిసి క్షమాపణ కోరతానని అన్నారు. ఏఐసీసీకి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు (komatireddy Venkat Reddy) లేఖల ద్వారా వివరణ ఇస్తానని అద్దంకి దయాకర్ వివరించారు. అద్దంకి ఇచ్చిన ఈ వివరణతోనైనా ఆయన చేసిన వ్యాఖ్యల వివాదం సద్దుమణిగిపోతుందేమో చూడాలి మరి.


Also Read : Revanth Reddy: మునుగోడులో రేవంత్ రెడ్డి అదిరిపోయే స్కెచ్.. టీఆర్ఎస్, బీజేపీ షేక్!


Also Read : Etela Rajender: బీజేపీతో మరికొంత మంది టచ్‌లో ఉన్నారు..ఈటల రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook