Balakrishna Revanth Reddy Meet: ఒకప్పుడు ఒకే పార్టీలో కొనసాగిన వారిద్దరూ దాదాపు పదేళ్ల మళ్లీ ఒకచోటకు చేరారు. రాజకీయంగా వేర్వేరు పార్టీలు అయినా వారు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. వారే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, రేవంత్‌ రెడ్డి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసంలో ఆదివారం బాలకృష్ణ సమావేశమయ్యారు. కొన్ని నిమిషాల సేపు వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య కీలకాంశాలు చర్చలోకి వచ్చినట్లు సమాచారం.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KT Rama Rao: శ్రీధర్‌ రెడ్డి హత్యపై కేటీఆర్‌ ఫైర్‌.. ఇలాంటివి మళ్లీ జరిగితే రేవంత్‌ రెడ్డి తట్టుకోలేవు


ఉమ్మడి ఏపీలో, రాష్ట్ర విభజన అనంతరం కూడా రేవంత్‌ రెడ్డి, బాలకృష్ణ టీడీపీలో కొనసాగారు. తెలంగాణలో టీడీపీ ప్రాబల్యం కోల్పోవడంతో రేవంత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి అనంతరం ముఖ్యమంత్రి అయ్యారు. ఇక బాలకృష్ణ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్నారు. పార్టీలపరంగా వేరయిన వీరిద్దరి మధ్య చక్కటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలుసుకోవడంతో వీరి మధ్య నాటి టీడీపీతోపాటు ప్రస్తుత పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. రేవంత్‌ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏపీ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బాలయ్య, రేవంత్‌లు చర్చించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్నప్పుడు కూడా బాలయ్య సత్సంబంధాలు కొనసాగించారు. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి కావాల్సిన సహకారం నాటి సీఎం కేసీఆర్‌ అందించారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డితో కూడా ఆస్పత్రి వ్యవహారాలు బాలయ్య చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read: TSRTC As TGRTC: తెలంగాణ ఆర్టీసీ పేరు మార్పు.. టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఆర్టీసీ


గత జ్ఞాపకాలు
ఏపీకి చెందిన బాలకృష్ణ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం స్థానం నుంచి కూటమి తరఫున పోటీలో నిలిచారు. ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హిందూపురం నుంచి మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా అక్కడ బాలకృష్ణ తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. గెలుపు అవకాశాలు చాలా కష్టంగా ఉన్నాయి. అక్కడి అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ తీవ్ర పోటీనిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచి.. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే బాలకృష్ణ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ చేతిలో రెండు, మూడు చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం పూర్తి దృష్టి రాజకీయాలపై పెట్టడంతో సినిమాలకు కొంత దూరమయ్యారు. ఏపీలో ఎన్నికల ఫలితాలను బట్టి బాలకృష్ణ సినిమాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి