ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు . ఏకంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ అభ్యంతరకర కామెంట్స్ చేశారు. ప్రధాని మోడీని ఛాయ్ వాలా అంటూ వ్యగ్యంగా సంబోధిస్తూ అరే  ఛాయ్ వాలే.. మా జోలికి రాకు...మా జోలికి వస్తే చెవిలో నుంచి రక్తం వచ్చేలా కొడతామని కామెంట్ చేశారు. తమ జోలికి వస్తే హైదరాబాద్ లో అడుగుపెట్టనివ్వమన్నారు. హైదరాబాద్ లో మోడీ ప్రచారం నేపథ్యంలో అక్బరుద్దీన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగి ఆధిత్యనాథ్ పై సెటైర్లు


అలాగే యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ...ఈ రోజు వింత బట్టలు ధరించే ఒకరు హైదరాబాద్ వచ్చారు.. అదృష్టం కొద్ది అతను ముఖ్యమంత్రి అయిపోయారు.. తెలంగాణలో అధికారంలోకి వస్తే నిజాంలను తరిమినట్లుగా ఓవైసీపీ బ్రదర్స్ ను కూడా హైదరాబాద్ నుంచి తరిమికొడతానంటున్నారు..అరె.. నువ్వెంత నీ బతుకెంత.. నీలాంటి వాళ్ల ఎందురో అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు..మమ్మల్సి ఏం చేయాలేకపోయారని ఎద్దేవ చేశారు


ఇటీవలె హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంలో ఓవైసీ బ్రదర్స్ ను టార్గెట్ చేస్తూ యోగి ఆదిత్యనాథ్ విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నుంచి ఓవైసీపీ సోదరులన ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.