Akbaruddin case: నేడే అక్బరుద్దీన్ కేసు తుది తీర్పు.. పాత బస్తీలో భద్రత కట్టుదిట్టం!
Akbaruddin case: తొమ్మిదేళ్ల క్రితం నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసుపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పాత బస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Akbaruddin case: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గతంలో మత విద్వేశాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న కేసుపై నేడు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు తుది తీర్పు వెలువరించనుంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో తొమ్మిదేళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ పూర్తి చేసుకుంది. నేడు తుది తీర్పు వెలుడనుంది. ఈ నేపథ్యంలో పాతబస్తీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేసు తీర్పు నేపథ్యంలో పలు ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు చెప్పారు పోలీసు ఉన్నతాధికారులు. దీనితోపాటు పరిస్థితిని ఉన్నతాధికారులే స్వయంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.
నగరవ్యాప్తంగా తొమ్మిది సెన్సిటివ్ ఏరియాలను గుర్తించి.. ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. సెన్సిటివ్‌గా గుర్తించిన ప్రాంతాల్లో చార్మినార్, మక్కా మసీద్, చాంద్రాయణగుట్ట ప్రాంతాలు ప్రధానంగా ఉన్నాయి. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు పోలీసులు.
ఈ కేసులో తీర్పు ఎలా ఉన్నా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకే అదనపు బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు పోలీసు ఉన్నతాధికారులు. ప్రస్తుతానికి అన్ని ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణమే ఉందని.. స్పష్టం చేశారు.
Also read: Komatireddy: పైసలు ఉంటే ముందే కొనొచ్చుగా.. కేసీఆర్ ఢిల్లీలో ఎందుకు ప్రకటన చేశారు: కోమటిరెడ్డి
Also read: CM KCR Press Meet: యాసంగిలో ధాన్యం మొత్తం మేమే కొనుగోలు చేస్తాం: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook