Amazong to Invest in Hyderabad | తెలంగాణ పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు కీలక ప్రకటన చేశారు. పెట్టుబడులను అకర్షించడంలో తెలంగాణ ( Telangana ) రాష్ట్రం దూసుకెళ్తోంది అని తెలిపిన కేటీఆర్ రాష్ట్రంలో తాజాగా రూ.20,761 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి అని ప్రటకించారు. అమెజాన్ ( Amazon) హైదరాబాద్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించింది అని వివరించారు కేటిఆర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Photos: నాగార్జున సాగర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు



అమేజాన్ తన వెబ్ సర్వీసెస్ (AWS) ను విస్తరిస్తూ హైదరాబాద్‌లో 2.77 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ సంస్థ కార్యకలాపాలు 2022లో ప్రారంభం కానున్నాయని సమాచారం. ఆలోపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ ( AWS) కోసం కావాల్సిన డాటా కేబుళ్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.



Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్ నుంచి Prabhas Latest Photos


 ముంబై తరువాత భారతదేశంలో రెండో ఏడబ్బ్యూఎస్ హైదరాబాద్‌లోనే ఏర్పాటు కానుంది. ఏసియా పసిపిక్ ప్రాంతంలో ఇది 11వ ఏడబ్బ్యూఎస్ రీజిన్ కానుంది. అమేజాన్ కార్యకలాపాలను నిర్వహించడానికి శంషాబాద్, చందన్ వెల్లి, మహేశ్వరం ప్రాంతాలను పరిశీలిస్తోందట. ఈ ప్రాంతాల్లో డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ డాటా సెంటర్లకు సొంతంగా పవన్ కెపాసిటీ, కూలింగ్, సెక్యూరిటీ, లో లాటెన్సీ నెట్వర్క్ ద్వారా కనెక్షన్స్ అందిస్తారు. తెలంగాణ చరిత్రలోనే ఇది అతి పెద్దదైన విదేశీ పెట్టుబడి అని మంత్రి కేటిఆర్ ( KTR ) తెలిపారు.


Also Read | Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR