10Th Class Exams Paper Leak: అటెండర్ నెత్తిన 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు.. వీడియో వైరల్
TS 10Th Class Exams Paper Leak: హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ అయ్యాయనే వార్త వెలువడిన తరువాత ఒకట్రెండు గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది.
TS 10Th Class Exams Paper Leak: హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు వాట్సాప్ ద్వారా లీక్ అయ్యాయనే వార్త వెలువడిన తరువాత ఒకట్రెండు గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా బోర్డ్ ఎగ్జామ్స్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను పోలీసు భద్రత నడుమ ఉంచి.. పరీక్షల సమయానికి పోలీస్ భద్రత మధ్యే పరీక్షలు జరిగే పరీక్ష కేంద్రాలకు తీసుకొస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ఉంటాయి అనేది ఆ నిబంధన వెనుక ఉన్న అర్థం. పరీక్ష హాలులోనూ విద్యార్థుల సమక్షంలోనే ప్రశ్న పత్రాల సీల్ తీసి వారి వద్దే సాక్షి సంతకాలు తీసుకుంటుంటారు. ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా ఉండటానికి ఇలాంటి నిబంధనలు ఎన్నో ఉంటాయి.
అయితే, తాజాగా హైదరాబాద్ లోని రాంకోట్ అలెన్ స్కూల్ పరీక్ష సెంటర్‌లో జరిగిన 10వ తరగతి పరీక్షలకు మాత్రం అక్కడి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది. 10వ తరగతి ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రానికి తరలించే క్రమంలో కనీసం పోలీస్ భద్రత కూడా లేకుండానే స్కూల్ లో పనిచేసే ఒక అటెండర్‌తో పోలీస్ స్టేషన్ నుండి కాలి నడకన పరీక్ష ప్రశ్న పత్రాలు తెప్పించారని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఉదంతం ఎంత సంచలనం సృష్టించిందో, ఎన్ని అవినీతి ఆరోపణలకు దారి తీసిందో ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణ ఇంకా ఒ కొలిక్కి రాక ముందే మరోసారి 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు వచ్చిన వార్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి ఇరకాటంలో పడేశాయి.
ఇవన్నీ ఇలా ఉండగానే తాజాగా పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలను ఇలా పోలీసు భద్రత లేకుండానే కాలి నడకన తీసుకురావడం చర్చనియాంశమైంది. అలా ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రానికి తరలించే క్రమంలో దారి మధ్యలో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఏ ఒక్క చిన్న నిర్లక్ష్యం జరిగినా.. అది పరీక్ష రాసే విద్యార్థులపై ఎంతో ప్రభావం చూపిస్తుంది అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్యం మరో చోట జరగకుండా సంబంధిత అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : 10th Class Papaer Leak 2023: వాట్సాప్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. ఆందోళన చేస్తున్న విద్యార్థులు!
ఇది కూడా చదవండి : TSPSC Paper Leak: రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్.. మీకర్థమవుతోందా.. పరువు గల కేటీఆర్ గారూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook