SSC Paper Leak Telangana: వాట్సాప్‌లో 10th క్వశ్చన్ పేపర్ లీక్.. ఆందోళన చేస్తున్న విద్యార్థులు

10th Class Telugu Question Paper Goes Viral on WhatsApp. వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. 9.37 నిమిషాలకు వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 5, 2023, 11:32 AM IST
  • వాట్సాప్‌లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్
  • ఆందోళన చేస్తున్న విద్యార్థులు
  • అధికారులను ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు
SSC Paper Leak Telangana: వాట్సాప్‌లో 10th క్వశ్చన్ పేపర్ లీక్.. ఆందోళన చేస్తున్న విద్యార్థులు

Telangana 10th Class Papaer Leak 2023: ఇటీవలి కాలంలో పేపర్ లీక్ కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసు సంచలనంగా మారింది. లీకేజీ కేసులో సిట్‌ విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్‌ చేసిన ప్రవీణ్‌, రాజశేఖర్‌, పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ విచారణ జరుగుతుండగానే.. మరో పేపర్ లీక్ కలకలం రేపింది. 

వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ (SSC Telugu Papaer Leak) అవ్వడం నేడు కలకలం రేపింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు పదవ తరగతి పరీక్ష మొదలు కాగా.. ఏడు నిమిషాల తర్వాత (9.37 నిమిషాలకు) వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. తాండూరులోని ఓ సెంటర్‌లో ప్రశ్నాపత్రం లీక్ అయింది. పలు వాట్సాప్‌ గ్రూపులలో టెన్త్ క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టడంతో అందరూ షాక్ అయ్యారు. 

వాట్సాప్‌లో ప్రశ్నాపత్రం లీక్ (Tandoor 10th Class Papaer Leak) అవ్వడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ జిల్లాలో ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదని వికారాబాద్ డీఈవో చెబుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదని అధికారులు చెబుతుండడంతో.. వాట్సాప్‌ గ్రూపులలో చక్కర్లు కొట్టే పేపర్ ఎక్కదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ పేపర్ లీకేజ్ కూడా సంచలంగా మారే అవకాశం ఉంది. 

Also Read: iPhone SE 4 Launch: చౌకైన ఐఫోన్ వస్తోంది.. ధర, ఫీచర్లు తెలిస్తే షాక్!

Also Read: Best SUV under 10 Lakh: 10 లక్షలలోపు 5 సూపర్ ఎస్‌యూవీలు.. బెస్ట్ మైలేజ్, సూపర్ లుకింగ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News