Kavitha on Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన వేళ టీఆర్ఎస్ నేతలు వరుసబెట్టి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ 27 ప్రశ్నలతో అమిత్ షాకు బహిరంగ లేఖ రాయగా.. తాజాగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా ప్రశ్నలు సంధించారు. అమిత్ షా తెలంగాణ పర్యటనకు స్వాగతం పలుకుతూనే తెలంగాణ పట్ల కేంద్రం తీరును ఎండగట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడాన్ని కవిత ఈ సందర్భంగా ప్రస్తావించారు. కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టుతో పాటు కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి... తెలంగాణను విస్మరించడం కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా అని ప్రశ్నించారు.


ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ బకాయిలు రూ.3వేల కోట్లు.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే రూ.1350 కోట్లు, జీఎస్టీ పరిహారంగా రావాల్సిన రూ.2247 కోట్లు కేంద్రం ఎప్పుడు చెల్లిస్తుందని కవిత ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 'ప్రతీ ఇంటికి తాగునీరు' పథకానికి స్పూర్తిగా నిలిచిన  మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు రూ.24వేల కోట్లు నిధులు ఇవ్వాల్సిందిగా నీతి ఆయోగ్ ఇచ్చిన ప్రతిపాదనలను ఎందుకు పక్కనపెట్టారని నిలదీశారు. 


ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగిత రేటు, పెరిగిన మత కల్లోలాలు, పెరిగిన ఇంధన ధరలు... వీటన్నింటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా... గడిచిన 8 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఐఐటీ గానీ ఐఐఎం గానీ ఐఐఎస్ఈఆర్ గానీ.. ఎన్ఐడీ, మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్స్ ఎందుకివ్వలేదో ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.


అంతకుముందు, మంత్రి కేటీఆర్ 27 ప్రశ్నలతో అమిత్ షాకు బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ రద్దు, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, డిఫెన్స్ కారిడార్ తదితర అంశాలపై కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 





అమిత్ షా హైదరాబాద్ పర్యటన :


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత ముగింపు సభ నేడు హైదరాబాద్ తుక్కుగూడలో జరగనుంది. ఈ సభకు కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సభకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యం దిశగా బీజేపీ పావులు కదుపుతున్న తరుణంలో నేటి సభలో అమిత్ షా కేసీఆర్ సర్కార్‌‌పై ఏం మాట్లాడబోతున్నారు... టీఆర్ఎస్ నేతలు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. 


READ ALSO: Teenmar Mallanna Exclusive Interview: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు?


READ ALSO: TSRTC City Bus: ఆర్టీసీ గుడ్ న్యూస్... హైదరాబాద్‌లో ఇక అర్ధరాత్రి తర్వాత కూడా సిటీ బస్సులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.