Police Misbehaves with girl in runnig train: ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకున్న మహిళలు, అమ్మాయిలపై వేధింపులు మాత్రం ఆగడం లేదు. నిర్భయ, పోక్సో వంటి ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు కామాంధులు ఇప్పటికి కూడా మారడంలేదు. బస్టాండ్ లు, మెట్రోలు, ఆఫీసులలో మహిళలను వేధించడమే పనిగా పెట్టకుని ఉంటున్నారు. మహిళ ఒంటరిగా దొరికితే చాలు.. ఆమెను వేధింపులకు గురిచేసి, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల కంటికి రెప్పలాగా కాపాడాల్పి అన్నలు, తండ్రుల వయస్సున్న వారు కూడా మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. సాధారణంగా వేధింపులకు గురైతే.. బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లి తమ గొడును చెప్పుకుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Bihar teachers reels: ఎగ్జామ్ పేపర్లు దిద్దుతూ లేడీ టీచర్ ల పాడుపని.. ఏకీ పారేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..


అలాంటి పోలీసులు కూడా వేధింపులకు గురిచేసిన ఘటనలు కొకొల్లలు. తమ కోరిక తీర్చాలని, ఫోన్ లు, వాట్సాప్ లలో అసభ్య సందేశాలు పంపుతు దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొన్ని చోట్ల పోలీసుల వేధింపులకు అమ్మాయిలు సూసైడ్ లు చేసుకున్న ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా, రన్నింగ్ ట్రైన్లో ఒక హోంగార్డు నిద్రిస్తున్న యువతి దగ్గరకు వెళ్లి వెకిలి చేష్టలు వేశాడు.  ఈ ఘటన వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో దారుణం జరిగింది. ఒక కుటుంబం తిరుపతి నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు. రాత్రిపూట ట్రైన్ లో ఒక హోంగార్టు యూనిఫామ్ వేసుకుని రైల్వే కోచ్ లలో తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతని చూపు నిద్రిస్తున్న యువతి మీద పడింది. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్లి, నిలబడినట్లు చేసి వెకిలీ చేష్టలు వేశాడు. దీంతో ఆమె నిద్ర నుంచి ఒక్కసారిగా ఉలిక్కి పడిలేచింది.  వెంటనే ఆమె చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు అలర్ట్ అయ్యారు.


యువతి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. హోంగార్డుతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాధితులు కాచీగూడ పోలీసులకు ఫోన్ చేసి ఘటనపై ఫిర్యాదుచేశారు. అప్పటికే ప్లాట్ ఫామ్ మీద సిద్దంగా ఉన్న కాచీగూడ పోలీసులు, రైలు ఆగగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడు కడప జిల్లా కోడురుకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.


Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..


రైల్వే కోడురూలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడని సమాచారం. అతగాడు టికేట్ లేకుండా జర్నీ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులను కాపాడాల్సిన పోలీసులు ఇలాంటి పాడు పనులు చేయడం ఏంటని , అనేక మంది పోలీసు శాఖను తిట్టిపోస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter