BRS Party Shock: అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ యువ నాయకుడు పార్టీ మారగా.. అదే రోజు పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి ముఖ్యమంత్రిని కలవడం కలకలం రేపింది. ఇది మర్యాదపూర్వకంగా సమావేశం అని చెబుతున్నా మహేందర్‌ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గులాబీ పార్టీకి తీవ్ర ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Harish Rao Warning: మేమే వస్తాం.. అప్పుడు మీ భరతం పడతాం.. కాంగ్రెస్‌కు హరీశ్ రావు హెచ్చరిక


హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తన సునీతా రెడ్డి, కుమారుడు రినీశ్ రెడ్డితో వెళ్లి కలిశారు. కొద్దిసేపు ముఖ్యమంత్రితో వారిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడారని సమాచారం. కొన్ని నిమిషాలపాటు రహాస్యంగా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా ముఖ్యమంత్రిని కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. వీరు రేవంత్‌ను కలిసిన సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి కూడా ఉన్నారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని మంత్రి అనుచరులు మీడియాకు వెల్లడించారు.

Also Read: Free Medical Service: ప్రజలకు మల్లారెడ్డి ఆస్పత్రి శుభవార్త.. ఏ చికిత్స అయినా ఫ్రీ.. ఇక పాప పుడితే రూ.5 వేలు


తెలంగాణలో సీనియర్‌ నాయకుడిగా పట్నం మహేందర్‌ రెడ్డి ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలను శాసించే స్థాయిలో మహేందర్‌ రెడ్డి ప్రభావం ఉంది. తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మహేందర్‌ రెడ్డి గెలిచారు. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి ఇద్దరు కలిసి పని చేశారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం నాటి సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మహేందర్‌ రెడ్డి మంత్రి అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అసంతృప్తితో ఉన్న మహేందర్‌ రెడ్డికి కేసీఆర్‌ ఆగమేఘాల మీద మంత్రి పదవి ఇచ్చారు. 


తాండూరు నుంచి అసెంబ్లీ టికెట్‌ ఆశించగా.. కేసీఆర్‌ నిరాకరించి సిట్టింగ్‌కే ఇవ్వడంతో మహేందర్‌ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మహేందర్‌ రెడ్డి పక్క దారి చూస్తున్నారని తెలుస్తోంది. తన సొంత వికారాబాద్‌ జిల్లాలో పార్టీ అభ్యర్థులు అందరూ ఓటమి చెందడంలో మహేందర్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారని చర్చ జరుగుతోంది. తన సొంత తమ్ముడు పట్నం నరేందర్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిపై పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇతడి సోదరుడి కుమారుడు కూడా వికారాబాద్‌ జిల్లాలో జెడ్పీటీసీగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం అనుచరులు భారీగా ఉన్నారు. 


ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహేందర్‌ రెడ్డిని కాంగ్రెస్‌ చేర్చుకునే అవకాశం ఉంది. మహేందర్‌ రెడ్డి భార్య సునీతా రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్ పర్సన్‌ వ్యవహరిస్తున్నారు. కుమారుడు రినీశ్‌ రెడ్డి కూడా రాజకీయాల్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో పదవుల ఆశతో మరోసారి మహేందర్‌ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.చేవెళ్ల లోక్‌సభ స్థానం ఆశిస్తున్నట్లు సమాచారం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook