AP, Telangana weather forecast updates: హైదరాబాద్: కేరళలో భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుండగా తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సైతం భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం ఉత్తర కేరళలోని జిల్లాలతో పాటు తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. అరేబియా సముద్రంలో ఆగ్నేయం దిశగా లక్షద్వీప్‌కి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో (Low pressure) ఉత్తర కేరళలో భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో వాతావరణ శాఖ ఉత్తర కేరళకు ఆరెంజ్ అలర్ట్ (Orange alert) జారీచేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఏపీలలో (Rain alert for Telangana and AP) రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తరాదిన సైతం పలు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నివేదికలు (IMD weather report today) చెబుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఢిల్లీలోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 


Also read : Uttarakhand Rains : ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్ర నిలిపివేత


ఇదిలావుంటే, మరోవైపు కేరళలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల్లో (Kerala floods) చిక్కుకుని కొంత మంది చనిపోతే.. కొండ చరియలు విరిగిపడి ఇంకొంత మంది మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో జనం మృతి చెందినట్టు తెలుస్తుండగా భారీ మొత్తంలో పంటలు, ఆస్తి నష్టం సంభవించినట్టు సమాచారం. పఠానమిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల (Heavy rains in Kerala) నేపథ్యంలో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీచేశారు.


కేరళలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. కేరళకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన ప్రధాని మోదీ (PM Modi on Kerala floods).. మరిన్ని సహాయ బృందాలను పంపించి రక్షణ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.


Also read : Hyderabad Rain : హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. Yellow alert జారీ


Also read : AP Power Crisis: ఏపీలో విద్యుత్ సంక్షోభం ఉందా లేదా, విద్యుత్ శాఖ ఏం చెబుతోంది, ఏది వాస్తవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook