Uttarakhand Rains : ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్ర నిలిపివేత

Uttarakhand Rains IMD issues red alert for tomorrow : ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో చమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేశారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2021, 05:44 PM IST
  • ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
  • బద్రీనాథ్ యాత్ర నిలిపివేత
Uttarakhand Rains : ఉత్తరాఖండ్‌లో రెడ్‌ అలర్ట్‌.. బద్రీనాథ్‌ యాత్ర నిలిపివేత

Uttarakhand Rains IMD issues red alert for tomorrow; all schools in Uttarkashi, Chamoli to remain shut : నేటి నుంచి రానున్న రెండు మూడు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది. దీంతో చమోలీ (Chamoli) జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆదివారం బద్రీనాథ్ (Badrinath) యాత్రను నిలిపివేశారు. 

వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులంతా జోషిమఠ్‌, పాండుకేశ్వర్ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ డిస్టిక్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు ఖురానా కోరారు. అలాగే సోమవారం స్థానికంగా ఉండే స్కూల్స్‌కి సెలవు ప్రకటించారు. ఇక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామీ (Pushkar Singh Dhami) ఆదేశాలు జారీ చేశారు.

Also Read : Kodali Nani : చంద్రబాబుపై ఫైర్ అయిన కొడాలి నాని 

రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ చమోలీ జిల్లాలో (Chamoli District) అకస్మాత్తుగా వరదలు వచ్చి బీభత్సం సృష్టించాయి. పెద్దసంఖ్యలో స్థానికులు గల్లంతయ్యారు.

ఇక మరోవైపు కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు దాదాపు 11 మంది మృతి చెందారు. మరో 12 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో శబరిమల (Sabarimala) దర్శనానికి ఎవరూ రావొద్దంటూ కేరళ (Kerala) ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Also Read : Good news: మరోసారి తండ్రి కాబోతున్న ధోని?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News