Hyderabad rains updates: హైదరాబాద్: ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మరోసారి తడిసిముద్దయింది. ఆదివారం ఉదయం నుంచే నగరం నలుమూలలా వర్షం కురుస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా రెండు గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ (Yellow alert) జారీ చేసింది.
భారీ వర్షాలు కురుస్తున్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం సంబంధింత అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. అత్యవసర సేవల విభాగం సిబ్బంది క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల్సిందిగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికార యంత్రాంగం కింది స్థాయి సిబ్బందికి సూచించారు.
Also read : Kurnool Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవంలో హింస
ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, మెహిదీపట్నం, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, ఈసీఐఎల్, ఘట్కేసర్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం (Heavy rains in Hyderabad) కురుస్తోంది.
Also read : Coronavirus updates: దేశంలో కాస్త తగ్గిన కోవిడ్ కేసులు, 166 మంది మృతి
Also read : Spicejet Airlines: స్పైస్‌జెట్ సంస్థకు షాక్ ఇచ్చిన డీజీసీఏ, కార్గో లైసెన్స్ నిలిపివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook