‘KCR.. ఇది బంగారు తెలంగాణ కాదు.. భ్రమల తెలంగాణ’
తెలంగాణ (Telangana)లో సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఓ న్యాయమని, రాష్ట్ర ప్రజలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయం లాక్‌డౌన్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు లాక్‌డౌన్ నియమాలు ఏ మాత్రం పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది బంగారు తెలంగాణ కాదని భ్రమల తెలంగాణ అని టీపీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
సోషల్ మీడియా ఖాతాలు డిలీట్ చేసిన నటి
ప్రజల విషయానికొస్తే పెళ్లి అంటే కేవలం 20 మందికి, చావు అంటే 10 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. మాస్కులు లేకుంటే రూ.1000 జరిమానా అన్నారు. కానీ కొండపోచమ్మ సాగర్‌కు నీటి విడుదల కార్యక్రమంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, సహా పలువురు నేతలు, అధికారులు దాదాపు 100 మంది ఎలాంటి మాస్కులు ధరించకుండా పూజలు నిర్వహించారని విమర్శించారు. మీకో న్యాయం, ప్రజలకో న్యాయమా సారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి