దంగల్ నటిపై ట్రోలింగ్.. జైరా వసీమ్ సోషల్ మీడియా ఖాతాలు డిలీట్

టీనేజ్ నటి, దంగల్ ఫేమ్ జైరా వసీమ్ (Zaira Wasim) మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఈసారి ఏకంగా ట్రోలింగ్ తట్టుకోలేక సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసుకుంది. అసలేం జరిగింది వివరాలు మీకోసం..

Last Updated : May 31, 2020, 07:40 AM IST
దంగల్ నటిపై ట్రోలింగ్.. జైరా వసీమ్ సోషల్ మీడియా ఖాతాలు డిలీట్

Zaira Wasim Comments On Locusts | అసలే ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారి విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతుంటే, మరో పక్క దేశాన్ని మిడతల దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. మిడతల దాడి మానవ తప్పిదాలు, పాపాల ఫలమేనంటూ ‘దంగల్’ నటి జైరా వసీమ్ (Zaira Wasim) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చిచ్చు రేపాయి. ట్రోలింగ్ భరించలేక మొదట ఆ పోస్టులు డిలీట్ చేసిన నటి జైరా వసీమ్ ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను డిలీట్ చేయడం గమనార్హం. ఆల్ టైమ్ గరిష్టానికి బంగారం ధరలు

దంగల్ సినిమాలతో ఒక్కసారిగా 16ఏళ్లకే గుర్తింపు పొందిన నటి జైరా వసీమ్. అయితే రెండేళ్ల సినీ కెరీర్‌కు స్వస్తి పలికిన ఆ టీనేజ్ సంచలనం తరచుగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో పలు రాష్ట్రాలు మిడతల దాడిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తలమునకలై ఉన్నాయి. ఈ క్రమంలో మిడతల దాడిని సమర్థించేలా జైరా వసీమ్ పోస్టులు చేసి సోషల్ మీడియాలో అగ్గిరాజేసింది.

‘మానవ చర్యల పాపాల ఫలితమే మిడతల దాడి. వరదలు, ఇతరత్రా వాటికి కూడా మానవ చర్యల తప్పిదాలే కారణం. ఖురాన్‌లో దీనిపై పేర్కొన్నట్లుగా’ జైరా వసీమ్ మే 27న ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్టులు చేసింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ను చెత్త మాటలు మాట్లాడి దుర్వినియోగం చేయవద్దని కొందరు నెటిజన్లు నటిని హెచ్చరించారు. మతాన్ని ఉటంకిస్తూ కామెంట్లు చేస్తే ఇండస్ట్రీలో లేకుండా పోతావంటూ మరికొందరు జైరాపై మండిపడ్డారు.   బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

విపరీతమైన ట్రోలింగ్‌తో సోషల్ మీడియా ట్విట్టర్‌లో తన పేరు ట్రెండ్ కావడంతో చేసిన తప్పిదం తెలుసుకుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో తొలుత తాను చేసిన పోస్టులు డిలీట్ చేసింది. ఆపై ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను సైతం డిలీట్ చేసింది జైరా వసీమ్.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News