Arekapudi hot comments on padi kaushik reddy: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ను పెంచేవిగా మారాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ వ్యవహారం చినికి, చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో నిన్న (గురువారం) తెలంగాణలో హైడ్రామా కొనసాగింది.  బీఆర్ఎస్ పార్టీకీ చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది. ఇదే ప్రస్తుతం తెలంగాణలోన వివాదానికి ఆజ్యం పోసిందని చెప్పుకొవచ్చరు. ఒకవైపు అరికెపూడి కాంగ్రెస్ లో చేరిపోయారని కూడా రూమర్స్ వ్యాపించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాడి కౌశిక్ రెడ్డి.. అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తానన్నారు. దీంతో రచ్చ  స్టార్ట్ అయ్యింది.  ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయాలు హీటెక్కిపోయాయి. ఇద్దరు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. అంతేకాకుండా.. పాడి కౌశిక్ రెడ్డి.. ఇంటి మీదకు అరికెపూడీ గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లారు.అక్కడ పెద్ద గొడవ జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి వర్గీయులు, రాళ్లు, పూలకుండీలతో అరికెపూడీ అనుచరులపై విసిరినట్లు కూడా.. అరికేపూడీ వర్గీయులు ఆరోపించారు.దీనిపై కౌశిక్ రెడ్డి..తనపై రేవంత్ వెనుక ఉండి.. హత్యప్రయత్నం చేయించారని కూడా ఆరోపించారు.


 బీఆర్ఎస్ నేతలు సీపీ ఆఫీసుకు వెళ్లి , అరికెపూడీ, దాడులకు  పాల్పడిన వారిపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. సీపీ ఆఫీసులో తోపులాట కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అటు అరికెపూడీపై కేసు నమోదుచేసి, స్టేషన్ బెయిల్ పై వదిలేశారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి. సీపీ ఆఫీస్ లో ఏసీపీ పట్ల దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం పట్ల కౌశిక్ రెడ్డిపై కేసు సైతం నమోదైంది. ఈ క్రమంలో తాజాగా, శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


పూర్తి వివరాలు..


పాడి కౌశిక్ రెడ్డిపై , శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇది కౌశిక్ రెడ్డికి, తనకు జరుగుతున్నయుద్దమన్నారు. తనను రెచ్చగొట్టేలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమన్నారు. ఆంధ్రవాడినంటూ .. కౌశిక్ రెడ్డి లేని పోనీ గొడవలు క్రియేట్ చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. పాడి కౌశిక్ రెడ్డి గతంలో మహిళ గవర్నర్ ను సైతం అవమాన పర్చే విధంగా మాట్లాడరని కూడా గుర్తుచేశారు.


శేరిలింగం పల్లి ప్రజలు తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని అరికెపూడి అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి చచ్చిపోతానని చెప్పి.. సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాడని అన్నారు. వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకొవాలన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ.. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సపోర్టు చేస్తుందా.. అని ప్రశ్నించారు.


Read more: Viral Video: బాబోయ్.. సమోసాలో ‘కప్పకాలు’.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో..


బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తనను భాషమార్చుకొవాలని అంటున్నారు.. ఆయన గతంలో ఐఏఎస్ లతో, ఇతర అధికారులతో.. ఏవిధంగా మాట్లాడారో గుర్తు తెచ్చుకొవాలన్నారు. ముందు  మీద పద్దతి మార్చుకుని, ఇతరులకు చెప్పాలన్నారు. గాజులు, చీరలు పట్టుకుని.. మహిళలను , ఆడబిడ్డల్ని కౌశిక్ రెడ్డి అవమానపర్చే విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా.. అరికెపూడి గాంధీ మండిపడ్డారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.