Shamshabad hanuman temple Navagraha idols damange incident: తెలంగాణలో ప్రస్తుతం కొన్నిరోజులుగా హిందు దేవాలయాపై దాడుల ఘటన వివాదస్పదంగా మారిందని చెప్పుకొవచ్చు.  ఇటీవల సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాన్ని ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలితో తన్నుతూ నీచంగా ప్రవర్తించాడు. అమ్మవారి విగ్రహాంను ధ్వంసం చేశాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ముత్యాలమ్మ ఆలయం విధ్వంసం ఘటన ప్రస్తుతానికి రచ్చగా మారిందని చెప్పుకొవచ్చు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా దీనిపై హైదరబాద్ లో ముత్యాలమ్మ ఘటనతో ఒక్కసారిగా హిందు సంఘాలన్ని భగ్గుమన్నాయి. దుర్గాదేవీ నవరాత్రులలో సైతం నాంపల్లిలో దుర్గాదేవీ విగ్రహాంను కూడా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.  ఇలాంటి  ఘటనలకు కారణమైన నిందితుడ్ని కఠినంగా పనిష్మెంట్ చేయాలని హిందు సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం శంషాబాద్ పరిధిలోని హనుమాన్ ఆలయంలో మరో షాకింగ్ ఘటనచోటు చేసుకుంది. 


పూర్తి వివరాలు..


ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటన మరవక ముందే మరో ఘటన శంషాబాద్ లో చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలీటి పరిధిలో మరో దేవాలయంపై దాడి చేశారు.  ఆలయంలోని నవగ్రహా విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసినట్లు తెలుస్తొంది. అయితే.. పూజారీకి ఆలయంలో వెళ్లి చేసేసరికి.. అక్కడ విగ్రహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దీంతో పూజారీ వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది.


ఈ నేపథ్యంలో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.  ఇప్పటికైతే.. పోలీసులు ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.  


Read more: Aghori Naga Sadhu: దీపావళి రోజు ఆత్మార్పణం చేసుకుంటా..?.. హైదరబాద్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ మాత..


నవగ్రహాల ధ్వంసంపై స్థానికులు ఆందోళ చేపట్టారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేవాలయాలపై వరుస దాడుల మీద బీజేపీ, భజరందళ్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ ఘటనతో ఒక్కసారిగా హిందు దేవాలయాలపై దాడుల అంశం మాత్రం మళ్లీ వార్తలలో నిలిచింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.