ఆజాద్ నోట ..రేవంత్ మాట ; సీఎం అభ్యర్ధి విషయంలో అధిష్టానం పరోక్ష సంకేతాలు
కొండగల్ లోని రేవంత్ నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్
పోలీసుల చెర నుంచి విడుదలైన తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పరామర్శించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ స్వయంగా కొండగల్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ తో కలిసి ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ విషయంలో కేసీఆర్ తీరును విమర్శిస్తూ రేవంత్ రెడ్డికి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని..రేపు కేసీఆర్ స్థానంలో రేవంత్ ఉండి..రేవంత్ స్థానంలో కేసీఆర్ ఉండవచ్చని ఆజాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడి హోదాలో రేవంత్ యాక్టివ్ గా పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే.. ఇదే క్రమంలో ఆయన సీఎం రేసులో ఉన్నారని బలంగా ఊహాగానాలా వినిపిస్తున్న నేపథ్యంలో ఆజాద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ కు ఆజాద్ వార్నింగ్ ..
ఆజాద్ మాట్లాడుతూ పొలిటిషియన్ ఎప్పుడు మైకంతో పనిచేయకూడదని...ప్రతిపక్ష నేతల విషయంలోనూ హుందాగా వ్యవహరించాల్సి ఉందన్నారు. కేసీఆర్ తీరు అహకారపూరికంగా ఉందని... అక్రమంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని విమర్శించారు.. రేపు ఆయనకూ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆజాద్ వ్యాఖ్యానించారు.
ఆజాద్ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా ..
రేవంత్ విషయంలో ఆజాద్ వ్యాఖ్యలపై రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ను సీఎం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందే డిసైట్ అయి ప్రజలకు, ఇతర నేతలకు మెంటల్ గా ప్రిపేర్ చేసేందుకే ఆజాద్ ద్వారా అధిష్టానం ఈ మాటలు చెప్పించిందనే టాక్ వినిపిస్తోంది. సీఎం అభ్యర్ధి విషయంలో కాంగ్రెస్ కు క్లారిటీ లేదని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలుకు చెక్ పెట్టేందుకు ఆజాద్ ఈ స్టేట్ ఇచ్చారని పలవురు వాదిస్తున్నారు. కేసీఆర్ ను తీరును తప్పుబట్టే క్రమంలో ఆజాద్ ఇలా వ్యాఖ్యారు తప్పితే.. సీఎం అభ్యర్ధి విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ లోని మరో వర్గం వాదిస్తోంది. వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొంటున్నారు.