Mla Warning: బూతులతో రెచ్చిపోయిన బహదూర్ పుర ఎమ్మెల్యే.. బల్దియా అధికారులకు ధమ్కీ.. వీడియో వైరల్..
Bahadurpura mla: బహదూర్ పుర ఎమ్మెల్యే జీహెచ్ఎంసీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. తనతో పెట్టుకొవద్దని, తాను ఎంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bahadurpura mla fires on ghmc officers: మజ్లీస్ పార్టీకి చెందిన బహదూర్ పుర ఎమ్మెల్యే ముబీన్ అధికారులపై ఫైర్ అయ్యారు. ఒక ప్రార్థన మందిరం సమీపంలో రోడ్డుపనుల పెండింగ్ పై అధికారులపై ఆవేశంతో ఊగిపోయారు. జీహెచ్ఎంసీ అధికారులు నిద్రపోతున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకుంటే బాగుండదంటూ రెచ్చిపోయారు. ఇంకా ఎన్నాళ్లు రోడ్డుపనులు చేస్తారని, తానేంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినంటూ కూడా అధికారులపై చిందులు తొక్కారు. కనీసం పనులు పూర్తయ్యాయో.. లేదో కూడా చూసుకొవాల్సిన సమయం కూడా లేదా.. అంటూ అధికారులపై ఫైర్ అయ్యారు. తానేంత మంచి వాడినో.. అంతే చెడ్డవాడినని తనతో పెట్టుకొవద్దంటూ కూడా బల్దియా అధికారులు ధమ్కీ ఇచ్చారు.
ప్రస్తుతం బహదూర్ పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కొందరు ఎమ్మెల్యే తీరును తప్పుపడుతున్నారు. అధికారులను నిలదీయడం వరకు ఓకే.. కానీ దుర్బాషాలాడటం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. ఈ నేపథ్యంలో.. దీనిపై ఇప్పుడు రచ్చ నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. గతంలో కూడా పలువురు మజ్లీస్ ఎమ్మెల్యేలు కూడా అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించి వార్తలలో నిలిచారు. ఇప్పటికే దేశంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ లో ప్రమాణస్వీకారం చేస్తూ.. జై పాలస్తీనా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం కొనసాగుతుంది.
మరోవైపు జైభారత్ అనలేవు... కానీ జై పాలస్తీనా అంటావా.. అక్కడికే వెళ్లి ఉండోచ్చు కదా అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ వేశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలు, నినాదాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గొడవ కొనసాగుతున్న వేళ.. ఇప్పుడు మజ్లీస్ ఎమ్మెల్యే అధికారులపై దురుసుగా ప్రవర్తించి వార్తలలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి