Bakkini Narasimhulu as TTDP chief: టీటీడీపీ చీఫ్‌గా బక్కిని నరసింహులు ?
Bakkini Narasimhulu as TTDP chief ?: హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన అనంతరం టీటీడీపీ చీఫ్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కిని నరసింహులుని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు సమాచారం.
Bakkini Narasimhulu as TTDP chief ?: హైదరాబాద్: తెలంగాణలో టీడీపీకి ఎల్ రమణ గుడ్ బై చెప్పిన అనంతరం టీటీడీపీ చీఫ్ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎల్ రమణ పార్టీని వీడిన తర్వాత ఆ స్థానంలో ఇప్పటివరకు ఎవ్వరినీ నియమించలేదు. అయితే, తాజాగా రాజకీయవర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం టీటీడీపీకి కొత్త అధ్యక్షుడు రానున్నట్టు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కిని నరసింహులుని తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నట్టు సమాచారం.
టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కిని నరసింహులు పేరును ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీటీడీపీ అధ్యక్షుడు పదవితో పాటు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరును (TTDP working president) కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also read : AP CM YS Jaganపై అలిగి YSR Telangana Party పెట్టలేదన్న వైఎస్ షర్మిల
Who is Bakkini Narasimhulu: ఎవరు ఈ బక్కిని నరసింహులు ?
గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా చేసిన బక్కిని నరసింహులు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో తెలుగు దేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీని వీడకుండా పార్టీని బలపర్చేందుకు కృషిచేశారనే అభిప్రాయంతోనే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆయనకు ఈ పదవిని అప్పగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ టీడీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గానూ బక్కిని నరసింహులు సేవలు అందించారు.
ఇదిలావుంటే, టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎల్ రమణకు తగిన స్థానం కల్పిస్తామని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎల్ రమణకు (L Ramana) సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మరోసారి స్వాగతం పలికారు.
Also read: OU VI semester exams schedule: ఓయూ సెమిస్టర్ పరీక్షలు షెడ్యూల్ ఖరారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook