OU degree exams timetable: ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించే 6వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన టైమ్ టేబుల్‌ను (OU Degree exams schedule) ఉస్మానియా యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు గురువారం ప్రకటించారు. జూలై 27 నుంచి ఆగస్టు 21 వరకు బీఏ (CBCS) 6వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే బీఎస్డబ్యూ (BSW), బీకాం (BCom) 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరగనున్నాయి.
బీబీఏ 6వ సెమిస్టర్ పరీక్షలు జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నట్టు యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. బీఎస్సీ సెమిస్టర్ ఎగ్జామ్స్ జూలై 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు (OU BSc exams schedule) నిర్వహించనున్నారు. యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
Also read : Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రెడ్ అలర్ట్
ఓయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు (OU Degree semester exams) జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్ ప్రోటోకాల్స్ (COVID-19) కఠినంగా పాటించాలని పరీక్షా కేంద్రాల చీఫ్ సుపరింటెండెంట్స్‌కి ఆదేశాలు జారీచేసినట్టు యూనివర్శిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రాల్లోనే పరీక్షలు రాయాలని, మరోచోట పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించవద్దని (Degree students) ఓయూ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించినట్టు ఓయూ అధికారులు వెల్లడించారు.
Also read : Smartphones Price In India: రూ.20 వేలలో లభ్యమవుతున్న బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే, మీరూ ఓ లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook