Balakrishna: బాలకృష్ణ ఇంటికి బుల్డోజర్..!
Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి త్వరలో బుల్డోజర్ రాబోతుందా. ఇప్పటికే ఆయన ఇంటికి సంబంధించి ఎంత మేరకు కూలగొట్టాలో దానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు మార్కింగ్ చేశారు. ఇంతకీ బాలయ్య ఇంటిని రేవంత్ సర్కార్ ఎందుకు టార్గెట్ చేసింది.. వివరాల్లోకి వెళితే..
Balakrishna: తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్.. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను టార్గెట్ చేసారా.. ఆ నేపథ్యంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున కు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ను చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినందుకు ఆ మేరకు ఎన్ కన్వెన్షన్ ను రాత్రికి రాత్రి బుల్‌డోజర్స్ తో కూలగొట్టించాడు. అయితే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అస్మదీయులకు ఒకలా.. తస్మదీయులకు మరొలా అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే తెలుస్తోంది. ఎంతో మంది కాంగ్రెస్ నేతలు, ఒవైసీ బ్రదర్స్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాల జోలికి మాత్రం పోవడం లేదు ఎందుకు అని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ ..కేటీఆర్ కు నాగార్జున మాజీ కోడలు సమంతకు ఏదో సంబంధం ఉందంటూ చేసిన అసభ్యకర కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపై విచారం వ్యక్తం చేయలేదు కొండా సురేఖ. ఈ విషయమై రేవంత్ రెడ్డి కరెక్ట్ కాదని కూడా తన మంత్రి చెప్పకపోవడం విస్మయకరం.కనీసం తన క్యాబినేట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించను లేదు.
రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ షో సంద్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం వెనక అల్లు అర్జున్ బాద్యుడిని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడం వెనక కూడా రేవంత్ రెడ్డి సర్కారు హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని చెప్పుకొచ్చారు. అయితే.. సాధారణ క్రిమినల్స్ విషయంలో ఇదే విధంగా స్పందిస్తే బాగుంటుందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ ...బాలయ్య ఇళ్లను టార్గెట్ చేసిందా అంటే టార్గెట్ చేయడం వరకు ఓకే కానీ.. అది కక్ష్య పూరితంగా కాకుండా.. రోడ్డు విస్తరణలో భాగంగా ఆయన ఇంటి కొంత భాగాన్ని కూల్చనున్నారు.
ఇదంత కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా ... బాలయ్య ఇంటిని ప్రభుత్వ అధికారులు మార్క్ చేసి వెళ్లారు. ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి ఇంటితో పాటు అల్లు అర్జున్ మామ కే.చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ మీడియా హౌస్ యాజమాన్యాల ఇళ్లతో పాటు పలువురు ఇండస్ట్రిలిస్ట్స్ ఇళ్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ మహారాజా అగ్రసేన్ కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ పక్కన నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. పార్క్ చుట్టు ఉన్న ఆరు కూడళ్లు అభివృద్ది చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా ఈ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందంటున్నారు. భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న యజమానులకు నచ్చజెప్పి ఈ పనులు చేపట్టనున్నారు. కేబీఆర్ పార్క్ లో ముందుగా పిల్లర్స్ వేద్దామనుకున్నా.. అది ఏకో సెన్సిటివ్ జోన్ కావడంతో చాలా మంది పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు.
ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..
ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.