Bandi Sanjay Arrested: తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ని మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్ లోని తన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ కుమార్ అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని తెలుసుకున్న బీజేపి కార్యకర్తలు, బండి సంజయ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. తమ నాయకుడు బండి సంజయ్ కుమార్ ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు బలగాలను బీజేపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపి కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వీవాదం, తోపులాట చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనని ఏ కారణంతో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిందిగా బండి సంజయ్ డిమాండ్ చేసినప్పటికీ.. పోలీసులు అదేమీ చెప్పకుండానే తనని అరెస్ట్ చేయడానికి వచ్చారని బండి సంజయ్ ఆరోపించారు. ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో నోటీసులు కూడా ఇవ్వకుండానే, కనీసం కారణం ఏంటో కూడా చెప్పకుండానే అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడి తనని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన బండి సంజయ్... ఇదే విషయాన్ని లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. 


కరీంనగర్ లో ఎంపీ సొంత నివాసంలో బీజేపి కార్యకర్తలు, మద్దతుదారుల ప్రతిఘటన మధ్యే బండి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ని యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీసు స్టేషన్‌కి తరలించినట్టు తెలుస్తోంది. తమ నాయకుడు బండి సంజయ్ ని బొమ్మల రామారం పోలీసు స్టేషన్ కి తరలించారని తెలుసుకున్న బీజేపి నేతలు, కార్యకర్తలు.. ఆయనకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో పోలీసు స్టేషన్ కి చేరుకుంటున్నారు. 



 


ఇదిలావుంటే, తెలంగాణలో మంగళవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించి హిందీ ప్రశ్నపత్రం లీకేజ్ వెనుక బండి సంజయ్ హస్తం ఉందని పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేయడం చూస్తోంటే.. ఆయన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బండి సంజయ్ తన సతీమణి అపర్ణ తల్లి చనిపోయి 9 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కరీంనగర్ చేరుకున్నారు. అదే సమయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో తనపై వస్తోన్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని భావించినట్టు తెలుస్తోంది. కానీ ఈలోగానే పోలీసులు బండి సంజయ్‌ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి బొమ్మల రామారం పోలీసు స్టేషన్‌కి తరలించడం గమనార్హం.


ఇది కూడా చదవండి : TS SSC Paper Leak Case: 10వ తరగతి పేపర్ లీక్ ఘటనపై బండి సంజయ్‌పై ఆరోపణలు


ఇది కూడా చదవండి : TS Tenth Exams: టెన్త్ పేపర్ల లీక్‌పై ప్రభుత్వం సీరియస్.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్


ఇది కూడా చదవండి : Bandi Sanjay: కేసీఆర్.. దమ్ముంటే నీ ఎమ్మెస్సీ సర్టిఫికెట్ బయటపెట్టు: బండి సంజయ్ సవాల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK