Bandi Sanjay Challenge: తెలంగాణలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ సంచలన సవాళ్లు విసురుతుండగా.. ఇప్పుడు బీజేపీ రూపంలో మరో సవాల్‌ వచ్చింది. రేవంత్‌ రెడ్డి హామీలు నెరవేర్చానని నిరూపిస్తే తాను పోటీ నుంచి విరమించుకుంటానని కరీంనగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ సంచలన ప్రకటన చేశారు. దమ్ముంటే రేవంత్‌ రెడ్డి తన సవాల్‌ను స్వీకరించాలని ప్రకటించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: BRS Party: 24 ఏళ్ల బీఆర్‌ఎస్‌ పార్టీ.. చరిత్రంతా పోరాటమే.. కేసీఆరే ఊపిరి


 


మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు కుమార్ శనివారం బీజేపీలో చేరారు. కరీంనగర్‌లోని తన కార్యాలయంలో వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం బండి సంజయ్‌ మాట్లాడారు. 6 గ్యారంటీల అమలుపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్‌ పార్టీ డ్రామాలాడుతోందని తెలిపారు. ‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు.. అయినా వాటిని అమలు చేసినట్లు పచ్చి అబద్దాలాడుతున్నారు' అని విమర్శించారు. రేవంత్‌ రెడ్డికి నేను మీకు సవాల్ చేస్తున్నా.. వాటిని అమలు చేసినట్లు నిరూపిస్తే నేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా' అని సంచలన సవాల్‌ చేశారు.

Also Read: Manda Krishna: బ్రోకరిజంతోనే రేవంత్‌ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి: మంద కృష్ణ


 


పథకాలు అమలయ్యాయని నిరూపిస్తే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమని బండి సంజయ్‌ ప్రకటించారు. నిరూపించకపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 స్థానాల్లో పోటీ నుంచి వైదొలిగేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్‌ను స్వీకరించి తేదీ, సమయం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ పటేల్ విగ్రహం, భాగ్యనగర్ అమ్మవారి ఆలయం వద్దకైనా సరే... ఎక్కడికైనా వచ్చేందుకు తాను సిద్దమని తెలిపారు. హరీశ్‌ రావు, రేవంత్‌ రెడ్డి సవాళ్లపై బండి సంజయ్‌ స్పందిస్తూ పొలిటికల్ డ్రామాలుగా అభివర్ణించారు. 


'మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని మోసం చేశారు. ఇప్పుడేమో 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలాడుతున్నారు. మహిళలకు తులం బంగారం, స్కూటీతోపాటు నెలనెలా రూ.2,500 బ్యాంకులో జమ చేసినట్లు, రూ.4 వేల పింఛన్లు, ఇల్లులేనోళ్లకు జాగా, రూ.5 లక్షలు, రైతుబంధు రూ.15 వేలు ఇచ్చినట్లు రుజువు చేయాలని సవాల్ చేశారు. హామీలు అమలు చేయకపోవడంతోనే బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు ఓడించారని చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter