Lok Sabha Elections: ఉద్యమ కారుడు కాదు బ్రోకరిజంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ నుంచి తన కుమార్తెను గెలిపించుకునేందుకు కడియం శ్రీహరి రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయడానికి వెనకాడారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వద్ద కడియం శ్రీహరి డబ్బులు దండుకుని పార్టీ మారారని మండిపడ్డారు. వారిద్దరినీ రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: KCR Bus Yatra: నా వయసైపోతుంది.. యువకుల్లారా ఇక తెలంగాణ మీదే: కేసీఆర్
రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని మంద కృష్ణ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా వారిని టార్గెట్‌గా చేసుకున్న మందకృష్ణ తాజాగా తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడారు. ఇక రేవంత్ రెడ్డి లక్ష్యంగా మంద కృష్ణ విమర్శలు చేశారు. 'ఉద్యమం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. బ్రోకరిజం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో రేవంత్ ఎలా ఓడిపోతాడు' అని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి ఇతర పార్టీలో చేరితే పిచ్చికుక్కల్లా రాళ్లతో కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి మరి కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టాలా? అని నిలదీశారు. రేవంత్, శ్రీహరిపై ఎవరైనా రాళ్లు వేయొచ్చు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Revanth Reddy: ప్రచారంలో మానవత్వం చాటుతున్న సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరికి భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి తన కుమార్తె కావ్యను గెలిపించుకోవడానికి ఓటుకు రూ.5 వేల నుంచి రూ. 10 వేల దాకా ఇవ్వబోతున్నాడని విమర్శించారు. కూతురు గెలుపు కోసం రూ.100 ఖర్చు చేయనున్నాడని ప్రకటించారు. అవినీతిపరుడైన కడియం శ్రీహరి కుమార్తె కావ్యను వరంగల్‌లో ఓడించాలని పిలుపునిచ్చారు. పార్టీ మారిన కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter