Bandi Sanjay to Two days tour in Nalgonda, Suryapet: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanay) ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి నల్గొండ, సూర్యపేట (Bandi Sanya tour in Suryapet) జిల్లాల్లో ఆయన పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పర్యటన ఎందుకంటే..


కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నిరసనలు తెలుపుకుంటున్నారు.


ఈ నేపథ్యంలో బండి సంజయ్​ నల్గొండ(Bandi Sanya tour in Nalgonda), సూర్యపేట జిల్లాల్లో రైతులను నేరుగా కలిసి వారి సమస్యల గురించి మాట్లాడనున్నట్లు తెలంగాణ బీజేపీ తెలిపింది.


Also read: Revanth Reddy: కేసీఆర్, మోదీలను రైతులు బండకేసి కొట్టాలి... రేవంత్ సంచలన వ్యాఖ్యలు


రెండు రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా..


ముందుగా రేపు (సోమవారం) మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి ప్రాంతాల్లో పర్యటించనున్నారు బండి సంజయ్. మరుసటి రోజు (మంగళవారం) తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారని తెలంగాణ బీజేపీ తెలిపింది.


Also read: KTR: కేంద్రానికి కేటీఆర్ లేఖ.. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని..


Also read: TSRTC: చిన్నారులకు ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్..టికెట్ లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు!


ధాన్యం కొనుగోలు సమస్య ఏమిటి?


వర్షాకాలంలో పండించిన వరి (paddy procurement) పంట కొనుగోలు విషయమై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మీరు కొనాలంటే.. మీరు కొనాలు అంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి.


ప్రజలకు ఆహార కొరత రాకుండా చూసుకునే బాధ్యతను రాజ్యాంగం కేంద్రంపై పెట్టిందని.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్‌ సహా టీఆర్​ఎస్​ నాయకులు తమ వాదనను వినిపిస్తున్నారు. రైతులతో పెట్టుకుంటే.. ప్రభుత్వాలు కూలుతాయని హెచ్చరిస్తున్నారు.


ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. తెలంగాణలో పండించిన ప్రతి గింజ కొంటామని కేసీఆర్ గతంలోనే చెప్పారంటూ బీజేపీ ఎదురు దాడికి దిగింది. దీనితో వానాకాలం సీజన్‌లో వచ్చిన వరి ధాన్యం మొత్తాన్ని కొనాలని.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలను తెరవాలని డిమాండ్‌ చేస్తోంది.


Also read: Rare Case: డెంగ్యూ నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్.. అత్యంత అరుదైన కేసు...


Also read: elangana: తెలంగాణ బీజేపీ నేతల 'ఫాంహౌస్' మీటింగ్... ఎజెండా అదే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook