Bank Working Hours In Telangana: కరోనా కట్టడి చర్యలలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. గత నెల నుంచి విధించిన నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్రభావం చూపాయని, తద్వారా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలంగా ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ క్రమంలో నేటి నుంచి లాక్‌డౌన్ ఉండదని, జూన్ 19న రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులు, ఆర్టీసీ సర్వీసులు, ప్రభుత్వ కార్యాలయాల వేళలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో బ్యాంకులు గతంలో తరహాలో యథాతథంగా పూర్తి సేవలు అందించనున్నాయి. బ్యాంకు పని వేళలు తెలియక గ్రామాలవారు కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచే గతంలో మాదిరిగా సేవలు ప్రారంభిస్తున్నాయి. ఆయా బ్యాంకుల టైమింగ్స్ ప్రకారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో Telangana బ్యాంకు ఉద్యోగులు సేవలు అందించనున్నారు. అత్యవసరం అయితేనే బ్యాంకులకు రావాలని, లేనిపక్షంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.


Also Read: SBI Customers Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు సరికొత్త సౌకర్యం, ఏ ఛార్జీలు వసూలు చేయరు


బ్యాంకులకు వెళ్తున్న వారు కచ్చితంగా కోవిడ్19 (Telangana COVID-19 updates) నిబంధనలు పాటించాల్సి ఉంటుందని బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని, ముఖానికి మాస్కులు ధరించి వస్తేనే బ్యాంకులలోనికి అనుమతి ఇవ్వనున్నట్లు సిబ్బంది స్పష్టం చేసింది. మరో 6 నుంచి 8 వారాలలో కరోనా థర్డ్ వేవ్ రానుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తలు పాటించి కరోనాను తరిమికొట్టాలని అధికారులు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.  


Also Read: Telangana unlock: నేటి నుంచే తెలంగాణలో అన్‌లాక్.. Corona guidelines తప్పనిసరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook