Basara IIIT:  నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో కలకలం రేగింది. తన హాస్టల్ రూమ్ లో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్న సురేష్ విద్యార్థి తన రూమ్ లో ఉరి వేసుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. సూసైడ్ చేసుకున్న విద్యార్థిది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు. విద్యార్థి సూసైడ్ తో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టూడెంట్ ఉరి వేసుకుని చనిపోయినా అధికారులు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. ఈ ఘటనతో క్యాంపస్ లో టెన్షన్ వాతావరణం నెలకోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని నెలలుగా బాసర క్యాంపస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జూలైలో బాసర క్యాంపస్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలంటూ వారం రోజులపైగా రోడ్డుపైకి వచ్చారు. క్యాంపస్ అధికారులు ఎన్నిసార్లు చర్చలు జరిపినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసరకు ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి ఇచ్చిన గడువు పూర్తి కాగానే మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ హామీతో విరమించారు. ఇదిలా ఉండగానే క్యాంపస్ లో పుడ్ పాయిజన్ జరిగింది. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని.. అంతవరకు పోరాటం ఆపబోమని చెప్పారు. భోజనం తినకుండా విద్యార్థులు నిరసన తెలపడంతో మరోసారి అధికారులు చర్చించి కూల్ చేశారు.


ఇక రెండు రోజుల క్రితం క్యాంపస్ లోని తమ హాస్టల్ గదిలో ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత క్యాంపస్ లో సెక్యూరిటిని మరింత పెంచారు. వరుసగా జరుగుతున్న ఘటనలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల పేరెంట్స్ కూడా కలవరపడుతున్నారు.  


Read Also: TARGET KTR: ఫీనిక్స్ తో కేటీఆర్ ఫినిష్! పూర్తి ఆధారాలతో రంగంలోకి ఐటీ.. గులాబీ పార్టీలో కలవరం


Read Also: TRS VS BJP: బీజేపీ నేతల్లారా ఇండ్లలో చెప్పి బయటికి రండి! టీఆర్ఎస్ మంత్రుల వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook