Bathukamma 2022 celebrations: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో బతుకమ్మ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత రెడ్డి తదితరులు మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు. తెలంగాణ సాంస్కృతిక శాఖకు చెందిన కళా బృందాలు వేడుకలకు శోభ తెచ్చాయి. లయబద్దంగా నృత్యాలు చేస్తూ వేడుకకు వెలుగు తెచ్చాయి. ఈ సందర్భంగా వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలు లాంటి ప్రదర్శనలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో పాటు సెలవు దినంగా చేశారన్నారు. పండుగతో గ్రామీణ పేద మహిళలూ కొత్త చీరలు ధరించి బతుకమ్మ ఆడేలా రూ.339 కోట్ల వ్యయంతో బతుకమ్మ చీరలు అందజేయడం జరుగుతోందని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు. దీని ద్వారా నేతన్నలకూ ఉపాధిని కల్పించడం జరుగుతోందని అన్నారు. 


ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ సభ్యులు, వారి కుటుంబాల మహిళలు సిద్దం చేసిన బతుకమ్మల పోటీల్లో ఉత్తమ బహుమతికి ఆకారపు రామాదేవి ఎంపికయ్యారు. విజేతలకు ప్రెస్‌క్లబ్‌ కమిటీ బహుమతులు ప్రధానం చేసింది. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.వేణుగోపాలనాయుడు, రవికాంత్‌ రెడ్డి, కమిటీ ఉపాధ్యక్షులు శ్రీకాంత రావు, వనజ, కోశాధికారి రాజేష్. సంయుక్త కార్యదర్శులు హరి, రమేష్‌ వైట్లతో పాటు నూతన కార్యవర్గం మొత్తం హాజరయింది.


Also Read : Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?


Also Read : Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.


Also Read : Kavitha in Dharmapuri: ధర్మపురి స్పూర్తితో వచ్చే ఏడాది రాష్ట్ర స్థాయిలో వేడుకలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి