Bathukamma 2022: బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మట్టి ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే పండగలో భాగంగా పువ్వులను పూజించడం తెలంగాణ ప్రజల ఆనవాయితీ.. ఈ తొమ్మది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలంతా ఆటాపటలతో బతుకమ్మను పూజిస్తారు. అంతేకాకుండా 9 రోజుల్లో ప్రతి రోజూ ఒక్కొ రకమైన పూలతో బతుకమ్మను పేరించి.. దీవించండి అమ్మా అని మొక్కుతారు. అంతేకాకుండా ఈ క్రమంలో గౌరి మాతకు తిరొక్క నైవేద్యాలను కూడా సమర్పిస్తారు. అయితే తొమ్మదివ రోజూ బతుకమ్మ పండగను పురష్కరించుకుని ఎలా గౌరిని(బతుకమ్మను) గంగమ్మ ఒడిలోకి చేర్చుతారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
బతుకమ్మ పండుగ రోజున మహిళలు భక్తిశ్రద్ధలు పాటిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి ఇంటి ముందు కల్లాపి జాలి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ తలస్నానం చేస్తారు. అంతేకాకుండా సంక్రాంతిని తలపించే ముగ్గులు కూడా వేస్తారు. బతుకమ్మకు చివరి రోజులో భాగంగా ఇష్టమైన నైవేద్యాన్ని తయారుచేస్తారు. కొందరైతే గుమ్మానికి మామిడి ఆకులను కూడా గుచ్చుకుంటారు.
ఆ తర్వాత చేనులో నుంచి తెచ్చిన రంగురంగుల పూలను అరుగుపై పరిచి.. ఒక్కొక్క పువ్వును బతుకమ్మల పేరుస్తారు. ఇలా పేర్చిన తర్వాత పై భాగంలో దీపంతో పాటు పసుపుతో చేసిన గౌరమ్మని కూడా పెడతారు. ఇలా తయారుచేసిన బతుకమ్మను ఇంట్లోనే పూజించి.. ఊరంతా కలిసి ఓ సమూహంలో తయారై బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ చప్పట్లు మధ్య 9 నుంచి 10 చెట్లు తిరుగుతారు. ఇలా మహిళలంతా ఆరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు. చివరికి బతుకమ్మను చెరువు గట్టు వద్ద పూజించి గంగమ్మ ఒడిలోకి చేరుస్తారు.
పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం.. తొమ్మిది రోజులపాటు చాలా రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలైతే భక్తిశ్రద్ధలతో ఉండాలని శాస్త్రం చెబుతోంది. తొమ్మిది రోజుల పండగలో భాగంగా చివరి రోజున పూర్వీకులు వెల్లుల్లి మొక్కలను బతుకమ్మలో నాటే వారంట.. ఇలా నాటిన మొక్కల చుట్టూ చప్పట్లు కొడుతూ.. కోలాటాలాడుతూ.. బతుకమ్మ చుట్టూ ఆనందంతో తిరిగేవారని పురాణాల్లో పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి