Water Supply Shutdown: వేసవికాలంలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిన హైదరాబాద్‌ ప్రజలకు ఇంకా నీటి కష్టాలు తీరలేదు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా నీటికి కటకట ఏర్పడింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు ప్రకటించారు. అయితే నగరవ్యాప్తంగా కాదు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే నీటి సరఫరాకు అంతరాయం ఉటుందని వెల్లడించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Union Cabinet Race: తెలంగాణలో కేంద్ర మంత్రులు ఎవరూ? అరుణ, ఈటల, కిషన్‌కు స్థానం దక్కేనా?


ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వరద నీరు చేరకుండా తాగునీటి పైపులైన్ల మరమ్మతులు చేపడుతున్నారు. 900 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్లకు జంక్షన్‌ పనులు చేపడుతున్నామని జలమండలి అధికారులు వివరించారు. ఈ పనుల కారణంగా పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. వాటర్‌ బోర్డు డివిజన్‌ 8, 15 పరిధిలోని లింగంపల్లి, పటాన్‌చెరువు, ఈఎస్‌ఐ కమాన్‌ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. 


Also Read: Revanth Phone To CBN: చంద్రబాబుకు రేవంత్ గాలం.. ఫోన్‌ కాల్‌తో ఇండియా కూటమిలోకి ఆహ్వానం?


హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం, అశోక్‌ నగర్‌, జ్యోతినగర్‌, లింగంపల్లి, చందానగర్‌, గంగారం, మదీనాగూడ, హఫీజ్‌పేట్‌, డోయెన్స్‌ కాలనీ, బీహెచ్‌ఈఎల్‌ కంపెనీ, టౌన్‌షిప్‌, హెచ్‌సీయూ, పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉటుందని జలమండలి అధికారులు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter