Hyderabad cyber crime police filed case on shekar basha: యూట్యూబర్ హర్షసాయి ఘటన తెలుగు స్టేట్స్ లలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హర్షసాయి మీద పోలీసు కేసు నమోదు అయినప్పటి నుంచి అతను కన్పించకుండా పోయాడు. హర్షసాయి విదేశాలకు వెళ్లాడనే తెలియడంతో అతని కోసం లుక్ అవుట్ నోటీసులు సైతం పోలీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. హర్షసాయి తన వద్ద నుంచి రెండు కోట్లను తీసుకున్నాడని, అంతే కాకుండా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తనపై అత్యాచారం కూడా చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు దీనిపై సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు హర్షసాయి మాత్రం.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు.. కేవలం డబ్బులు కోసమే సదరు యువతి లేని పోనీ ఆరోపణలు చేస్తొందని కూడా పోస్ట్ లు పెడుతు హల్ చల్ చేస్తున్నాడు. ఇదిలా ఉండగా.. వీరి స్టోరీలో శేఖర్ బాషా ఎంట్రీ ఇచ్చాడు. అతను వీరిద్దరి వ్యవహారంలో కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తొంది. దీంతో యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల దగ్గరకు వెళ్లి.. శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు శేఖర్ బాషాను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తొంది.


యూట్యూబర్ హర్ష సాయి బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా ఆయనను మూడు గంటలుగా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. శేఖర్ భాష తనపై నిరాదన ఆరోపణలు చేశారని బాధితురాలు పేర్కొన్నారు.  ఇదిలా ఉండగా.. గతంలో లావణ్య, రాజ్ తరుణ్ వ్యవహారంలో కూడా శేఖర్ బాషా అనేక సందర్భాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తొంది. ఏకంగా లావణ్యను ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో చేయిచేసుకున్నడన్న వార్తలు బైటపడ్డాయి.


Read more: Jani master case: జానీ మాస్టర్ దగ్గరకు ఆ అమ్మాయిని నేనే పంపించా.. బాంబు పేల్చిన మరో లేడీ కొరియో గ్రాఫర్..


అంతేకాకుండా.. లావణ్య బైటకు వచ్చి.. తనను శేఖర్ బాషా పొట్టపై కాలితో తన్నాడని కూడా ఆమె చెప్పారు. అప్పట్లో శేఖర్ బాషా కూడా లావణ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆమె కూడా మండిపడ్డారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు యూట్యూబర్ హర్షసాయి ఘటనలో.. బాధితురాలు తనపై శేఖర్ బాషా లేని పోనీ అసత్య ఆరొపణలు చేశారంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆర్జే శేఖర్ బాషాను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దీంతో మరోసారి శేఖర్ బాషా వార్తలలో నిలిచాడని తెలుస్తొంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter