Konda Surekha Resignation: అత్యంత హేయంగా.. ఒక మహిళా నాయకురాలు.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఒక ప్రముఖ హీరోయిన్‌ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చి కొండా సురేఖ చేయరాని తప్పు చేశారు. రాజకీయంగా ఒకరిని ఇరుకున పెట్టాలని చూసి వారితో సంబంధం లేని వ్యక్తికి అక్రమ సంబంధం ఏర్పరచి రాజకీయంగా లబ్ధి పొందాలనే కుట్రలో ఆమె చిక్కుకుపోయారు. తప్పుడు ఆరోపణలు.. అసంబంధ విషయాలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు పదవీ గండం పొంచి ఉందని సమాచారం. త్వరలోనే ఆమెకు ఉద్వాసన లభిస్తుందని ప్రచారం జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని


 


సినీ నటీనటుల విడాకుల అంశాన్ని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి అంటగట్టడంతోపాటు హీరోయిన్‌ల రహాస్య సంభాషణలు ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా విని వారిని బెదిరించి.. డ్రగ్స్‌కు అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశారని మంత్రిగా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయంగా హైప్‌ క్రియేట్‌ చేస్తాయని భావించగా.. ఉల్టా ఆమెకు తీవ్ర ప్రతికూలంగా మారాయి. తెలుగు రాష్ట్రాలే కాదు యావత్‌ దేశం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆమె తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌


 


తెలుగు సినీ పరిశ్రమతోపాటు బాలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు అందరూ మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొన్న ఆ సినీ కుటుంబం ముక్తకంఠంతో ఖండించి తమ కుటుంబసభ్యుడికి మద్దతుగా నిలిచింది. ఇక రాజకీయంగా ఇరుకున పెట్టి లబ్ధి పొందాలని ఓ నాయకుడిపై నిరాధార ఆరోపణలు చేయడం రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఆ పార్టీనే కాదు ఇతర పార్టీల నాయకులు కూడా ఖండించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీల నాయకులు కూడా స్పందిస్తూ మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.


తెలుగు రాష్ట్రాల్లో మంత్రికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే క్రమంలో నటీనటుల అభిమానులు మంత్రి సురేఖను లక్ష్యంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి కీర్తి శేషులు కొండా సురేఖ అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. సురేఖ చనిపోయారంటూ ఆ నటుడి అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు. ఇక రాజకీయంగా ఆమె ఇరకాటంలో పడ్డారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ తీవ్ర రూపం దాలుస్తోంది.


త్వరలో ఉద్వాసన?
ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణ ఆగిపోగా తాజాగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో దసరాలోపు ఉంటుందని సమాచారం. ప్రస్తుత వివాదం కొండా సురేఖ మంత్రి పదవికి గండం తీసుకువచ్చింది. పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో చెడ్డపేరు రావడంతోపాటు అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండా సురేఖపై పార్టీలోనూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తొలి వికెట్‌ కొండా సురేఖ అని తెలుస్తోంది. ఆమెకు ఉద్వాసన పలికిన తర్వాతనే విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఆమె నోటి దూల ఆమె పదవినే కోల్పోయే దాకా చేస్తోందని సమాచారం. మరి ఏం జరుగుతుందో కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి