Rs 2 Lakh Loan Waive: ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అయిన రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్యారంటీల అమలుకు రేషన్‌ కార్డును ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం రుణమాఫీకి కూడా రేషన్‌ కార్డును ప్రమాణంగా తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bonalu 2024: బోనాల చెక్కుల పంచాయితీ.. నేలపై కూర్చోని మాజీ మంత్రి సబితా ఆగ్రహం


 


రైతు రుణమాఫీపై ఈ మేరకు ప్రభుత్వం సోమవారం  కీలక ప్రకటన చేసింది. మొదట్నుంచి చెప్పినట్లుగా రుణమాఫీకి మెలిక పెట్టింది. రూ.2 లక్షల రుణమాఫీకి అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. రైతులకు రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 9వ తేదీ డిసెంబర్  2023 వరకు రుణాలు తీసుకున్న వాటిని ప్రభుత్వం మాఫీ చేయాలని నిర్ణయించింది. స్వల్ప కాలిక పంట రుణాలకు ఈ రుణమాఫీ వర్తిస్తామనడం గమనార్హం.

Also Read: Hyderabad T Square: న్యూయార్క్‌ను తలదన్నేలా హైదరాబాద్‌లో భారీ నిర్మాణం.. ప్రపంచస్థాయిలో టీ స్క్వేర్


 


వ్యవసాయాన్ని లాభసాటిగా.. స్థిరంగా కొనసాగేలా చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. పంట రుణమాఫీ భారాన్ని రైతులకు తగ్గించి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపింది. షెడ్యూల్డ్‌ వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. రుణమాఫీ అమలుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. కాగా ఈ రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు చేస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వం నిధుల కోసం అన్వేషణ చేస్తోంది. ఈ క్రమంలోనే రైతులకు వర్షాకాలం పంటకు అందించాల్సిన రైతుబంధును ఎగబెట్టింది. రైతు బంధును రైతు భరోసా పేరిట పేరు మార్చి మార్గదర్శకాల కోసం ఓ కమిటినీ నియమించింది. దీంతో వర్షాకాలం అందాల్సిన రైతు బంధు పెట్టుబడి సహాయం రైతులకు అందడం లేదు.


మెలికపై సర్వత్రా ఆగ్రహం
ఈ మార్గదర్శకాలపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో భూమి ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్‌ కార్డు ఉన్న వారికి మాత్రమే అమలు చేస్తామని ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రుణమాఫీ అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ మండిపడింది. గతంలో అందరికీ అని చెప్పి ఇప్పుడు మెలిక పెట్టడం సరికాదని పేర్కొంటోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి