TRS MLA Dasari Manohar Reddy: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే దాసరి మనోహర్​ రెడ్డికి సొంత నియోజకవర్గంలో (పెద్దపల్లి) చేదు అనుభవం ఎదురైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలు అభివృద్ధి పనులకు శ్రీకారకం చుట్టేందుకు శనివారం కొదురుపాక గ్రామానికి చేరుకున్న మనోహర్ రెడ్డి కాన్వాయ్​ను గ్రామస్థులు (Dasari Manohar Reddy) అడ్డుకున్నారు. తమ ఊర్లో అధ్వాన్నంగా మారిన రోడ్డును బాగు చేయాలని ఆందోళనకు దిగారు.


నిరసనలో భాగంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు (Protest Against Dasari Manohar Reddy) చేశారు గ్రామస్థులు. ఈ నేపథ్యంలో దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించి తమ ఆందోళన తెలిపారు. పోలీసులు గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలిచలేదు. దీనితో నిరసనకారులను అరెస్ట్​ చేసి సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.


Also read: Drunk Driving Vehicle Seizure: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయరు!


Also read: Arrest: మాల్ లో బట్టలు మార్చుకుంటున్న యువతి.. సీక్రెట్ వీడియో రికార్డింగ్.. ఏం జరిగింది..??


ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు..


గ్రామస్తులు చేపట్టిన ఆందోనకు స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. ఏడేళ్ల నుంచి రోడ్డు అధ్వాన్నంగా ఉన్నా నాయకులకు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు బాగు చేయించలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


Also read: VC Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్


Also read: Kokkirala Premsagar Rao: కాంగ్రెస్‌కు ఆ సీనియర్ నేత షాక్... పార్టీకి గుడ్ బై చెప్పే యోచన..?


నియోజకవర్గం పర్యటనలో మనోహర్ రెడ్డి..


దాసరి మనోహర్ రెడ్డి..ఇటీవల తన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల బ్రాహ్మణపల్లి గ్రామంలో PACS ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జులపల్లి మండలం పెద్దాపూర్​ గంగపుత్ర సంఘం భవన నిర్మాణఆనికి శంకుస్థాపన చేశారు. తన పర్యటనలో భాగంగానే కొదురుపాకకు చేరుకున్న మనోహర్ రెడ్డికి.. ప్రజాగ్రహం రూపంలో అనుకోని చుక్కెదురైంది.


Also read: Komatireddy Venkat Reddy: అక్కడి నుంచి ఉద్యమం మొదలుపెడుతా... రేపటి నుంచి నేనేంటో చూపిస్తా


Also read: TSRTC : తెలంగాణలో ఆర్టీసీ చార్జిల పెంపుకు ప్రతిపాదనలివే... ప్రజలపై ఎంత భారమంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook