Drunk Driving Vehicle Seizure: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయరు!

Drunk Driving Vehicle Seizure: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు పేర్కొంది. అలాగే మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దన్న న్యాయస్థానం.. మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే.. అతడికి వాహనాన్ని అప్పగించాలని తెలిపింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 06:52 AM IST
    • డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
    • వాహనాలు సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని వ్యాఖ్య
    • ఒకవేళ మద్యం సేవించి వాహనం నడిపితే.. ఆ వాహానాన్ని వారి సన్నిహితులకు అందజేయాలని తీర్పు
Drunk Driving Vehicle Seizure: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయరు!

Drunk Driving Vehicle Seizure: మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్​ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 43కు పైగా పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించారు.

మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్న వారి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకొంటుంటారు. ఆ తర్వాత వాహనదారులు కోర్టు విచారణ హజరై ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అనంతరం సదరు వ్యక్తి కుటుంబ సభ్యుల ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిగే అనర్థాలపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదంతా జరిగేందుకు మూడు రోజులకు పైగా పడుతుంది. అప్పుడు గానీ వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వరు.  

పోలీసుల తీరుపై వాహనదారులు మండిపడుతున్నా.. ఈ ప్రక్రియ వల్ల తాగి వాహనం నడపకూడదనే భయం వాహనదారుల్లో వచ్చింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ఇదిలా ఉంటే ఈ ఆంక్షలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. నగరంలోని ఓ కమిషనరేట్ పరిధిలో అయితే వాహనం పట్టుబడితే సుమారు 15 రోజులు పాటు వాహనం సీజ్​లో ఉంటుంది. దీంతో పలువురు వాహనదారులు ఈ అంశాలపై కోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ఇప్పటి వరకు 43కి పైగా పిటిషన్లు వచ్చాయి. వాటిని విచారించిన ధర్మాసనం.. ట్రాఫిక్ పోలీసులు వాహనం స్వాధీనానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ అదేశాలిచ్చింది. మార్గదర్శకాలను అమలుచేయని పక్షంలో పోలీసులు కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.  

రోడ్డు ప్రమాదాలు, మరణాలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న రోడ్డు భద్రత మార్గదర్శకాలను పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత పౌరులపై ఉందని హైకోర్టు తెలిపింది. మోటారు వాహనాల చట్టం నిబంధనలు.. సుప్రీం కోర్టుతోపాటు ఇదే హైకోర్టు గతంలో వెలువరించిన పలు తీర్పులను ఆధారంగా చేసుకుని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.  

వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు తేలితే వాహనం నడపడానికి అనుమతించరాదు. అతనితోపాటు మద్యం సేవించని మరో వ్యక్తి ఉండి, అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే వాహనాన్ని సీజ్ చేయకుండా ఆ వ్యక్తి తీసుకునేలా చూడాలి. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న డ్రైవర్​ మినహా వాహనంలో ఎవరూ లేకపోతే.. సంబంధిత పోలీసు అధికారి.. వాహనం తీసుకెళ్లడానికి సమీపంలోని డ్రైవర్​ బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వాలి.  

Also Read: Arrest: మాల్ లో బట్టలు మార్చుకుంటున్న యువతి.. సీక్రెట్ వీడియో రికార్డింగ్.. ఏం జరిగింది..??

Also Read: Police Arrests తెలంగాణ-ఆంధ్రా సరిహద్దులో ఆ స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు.. ఏడుగురి అరెస్ట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x