Arrest: మాల్ లో బట్టలు మార్చుకుంటున్న యువతి.. సీక్రెట్ వీడియో రికార్డింగ్.. ఏం జరిగింది..??

హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్‌లో ఓ యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు ఆకతాయిలు సీక్రెట్‌గా వీడియో తీశారు. యువతి గట్టిగా కేకలు [ఎత్తడంతో మాల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2021, 06:30 PM IST
  • షాపింగ్ మాల్ ట్రయల్ రూమ్‌లో సీక్రెట్ కెమెరా
  • యువతి దుస్తులు మార్చుకుంటుండగా వీడియో రికార్డింగ్
  • గుర్తించి గట్టిగా కేకలు పెట్టిన యువతి
  • నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన సిబ్బంది
Arrest: మాల్ లో బట్టలు మార్చుకుంటున్న యువతి.. సీక్రెట్ వీడియో రికార్డింగ్.. ఏం జరిగింది..??

Secret Video Recording While a girl Changing Clothes: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో దారుణం వెలుగుచూసింది. స్థానిక హెచ్ అండ్ ఎం షాపింగ్ మాల్‌లో ఓ యువతి దుస్తులు మార్చుకుంటుండగా ఇద్దరు ఆకతాయిలు సీక్రెట్‌గా వీడియో తీశారు. ఈ విషయాన్ని గమనించిన యువతి గట్టిగా కేకలు పెట్టింది. దీంతో మాల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

దీపావళి షాపింగ్ కోసం వెళ్లిన ఆ యువతి దుస్తులు మార్చుకునేందుకు ట్రయల్‌ రూమ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరు యువకులు తనను సీక్రెట్‌గా వీడియో తీయడం గమనించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడంతో మాల్ సిబ్బంది అప్రమత్తమై ఆ ఇద్దరినీ పట్టుకున్నారు.ఆపై 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read: Chhattisgarh CM Baghel: దీపావళి వేడుకల్లో కొరడాతో కొట్టించుకున్న ముఖ్యమంత్రి

ఇద్దరు నిందితులతో పాటు స్టోర్ మేనేజర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నిందితుల సెల్‌ఫోన్లను పోలీసులు పరిశీలించగా... గతంలో ఇలాగే సీక్రెట్‌గా చిత్రీకరించిన వీడియోలను గుర్తించారు.ప్రస్తుతం నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే జూబ్లీహిల్స్‌లో గత నెలలో ఇలాంటి ఘటనే వెలుగుచూసిన సంగతి తెలిసిందే. స్థానికంగా ఉన్న వన్ డ్రైవ్ ఫుడ్ కోర్ట్ అనే హోటల్లోని మహిళల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా కలకలం రేపింది.బాత్రూమ్‌కి వెళ్లిన యువతి ఒకరు సీక్రెట్ కెమెరాను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.బాత్రూమ్ క్లీనర్ బెనర్జీయే ఈ పనిచేసినట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read: NTR Undergoes Minor Surgery: ఎన్టీఆర్ కుడి చేతికి మైనర్ సర్జరీ.. ఫొటోలు వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News