VC Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar made a surprise visit: ఆర్టరీసీ ఎండీ వీసీ సజ్జనార్ మరోసారి వార్తల్లో నిలిచారు. హైదరాబాద్​ నుంచి నల్గొండ వరకు బస్సు ప్రయాణం చేశారు. నల్గొండ బస్టాండ్​లో తనిఖీ చేపట్టారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 04:56 PM IST
  • మరోసారి వార్తల్లో నిలిచిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్​
  • హైదరబాద్​ నుంచి నల్గొండకు బస్సు ప్రయాణం
  • ఆర్టీసీలో ఇబ్బందులపై ట్విట్టర్​ ద్వారా సూచనలు ఇవ్వొచ్చని వెల్లడి
VC Sajjanar: హైదరాబాద్‌ నుంచి నల్గొండకు బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

Sajjanar made a surprise visit: ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్​ (RTC MD VC Sajjanar) తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25 నుంచి ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్​ విధుల్లో మరోసారి తన మార్క్​ను చూపించారు.

శనివారం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్​ నుంచి నల్గొండ (Sajjanar Travels Hyderabad to Nalgonda in RTC bus) వరుకు ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణికులతో ముచ్చటించి ఆర్టీసిపై అభిప్రయాలను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటు నల్గొండలో ఆర్టీసీ బస్టాండ్​ను తనిఖీ చేశారు. బస్టాండ్​లో సౌకర్యాలు  సరిగ్గా ఉన్నయా లేవా అనే విషయాన్ని ఆరా తీశారు.

సమస్యలు నాకు చెప్పండి..

ప్రయాణాలకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సజ్జనార్​. కరోనా తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెళ్లి, వన భోజనాలు, విహారయాత్రల వంటి వాటికోసం ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటు మరిన్ని కొత్త సదుపాయాలను అందుబాటులో వస్తాయని వివరించారు. అయితే ఆర్టీసీ సేవల్లో ఏవైనా లోపులు, ఇబ్బందులు ఉంటే నేరుగా తన ట్విట్టర్​ ఖాతాకు.. అభిప్రయాలు తెలపొచ్చని సూచించారు సజ్జనార్​.

Aslo read: Mukesh Ambani: ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌కు మకాం మారుస్తున్నారా.. ఆ ప్రాపర్టీ అందుకే కొనుగోలు చేశారా?

తనిఖీ అనంతరం బస్టాండ్ ఆవరణలో మొక్క నాటారు సజ్జనార్​. ఆ తర్వాత డిపో అధికారులతో సమావేశం నిర్వహించారు. మళ్లీ నల్గొండ నుంచి మరో బస్సెక్కి మిర్యాల గూడా బస్టేషన్​కు బయల్దేరారు.

Also read: Kokkirala Premsagar Rao: కాంగ్రెస్‌కు ఆ సీనియర్ నేత షాక్... పార్టీకి గుడ్ బై చెప్పే యోచన..?

Also read: Drunk Driving Vehicle Seizure: మందు బాబులకు గుడ్ న్యూస్.. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయరు!

ఇంతకు ముందూ ఇలానే..

ఏ విభాగమైన తనదైన ముద్ర వేసుకోవడం సజ్జనార్ స్పెషాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే.. పోలీస్​ విభాగంలో ఉన్నప్పుడు సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుని తన ప్రత్యేకతను చాటుకుననారు. ఆర్టీసీ ఎండీగా కూడా పలు మార్లు సాధారణ పౌరుడిలానే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు.

Also read: Maharastra: ఐసీయూలో అగ్నిప్రమాదం...ఆరుగురు కరోనా రోగులు మృతి!

Also read: Edible Oil Price Reduced: దేశంలో భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు.. లీటరుకు రూ.5 నుంచి రూ.20 తగ్గింపు

నికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News