Bandi Sanjay On Tspsc Paper Leakage: కేసీఆర్ పాలనలో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలన్నీ లీక్ అయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆరోపించారు. గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షా పత్రం సైతం లీక్ అయ్యిందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ఈ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేయడంతోపాటు తానే స్వయంగా పరీక్ష రాశారని అన్నారు. అత్యధికంగా ప్రవీణ్‌కు 103 మార్కులొచ్చాయని.. అందుకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను రిలీజ్ చేశారు. ప్రవీణ్ కోసం పరీక్షా సమయాన్ని సైతం మార్చారని.. అభ్యర్థులందరికీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని అన్నారు. దీనివెనుక పెద్ద మతలబు ఉందన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది. ఉద్యోగాలకున్న డిమాండ్‌ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలమైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం. మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది. ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి.  


గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్‌ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు  జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది..' అని బండి సంజయ్ అన్నారు.


టీఎస్‌పీఎస్‌సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుందని.. ఛైర్మన్‌కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యమన్నారు. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్‌లో ఉండటానికి వీల్లేదన్నారు. ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎలా ప్రత్యక్షమవుతాయి..? అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యమన్నారు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. 


టీఎస్‌పీఎస్‌సీ నియమకాల్లోనూ ఛైర్మన్, కార్యదర్శులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని.. వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. 


Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?  


Also Read: Maruti Brezza: రూ.3 లక్షలకే ఈ కారు తీసుకెళ్లండి.. ఎగబడికొంటున్న జనం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook