Maruti Brezza @ Rs 3 Lakhs: రూ.3 లక్షలకే మారుతి బ్రెజ్జా కారు.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనం

Maruti Brezza EMI Calculator: ప్రస్తుతం మారుతి బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ SUV అత్యంత వేగంగా అమ్ముడవువుతన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కార్లకు భారీ డిమాండ్ పెరిగింది. మీరు కారును కొనుగోలు చేయాలంటే కేవలం రూ.3 లక్షలు చెల్లిస్తే సరి. పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 10:49 AM IST
Maruti Brezza @ Rs 3 Lakhs: రూ.3 లక్షలకే మారుతి బ్రెజ్జా కారు.. షో రూమ్ ముందు క్యూ కట్టిన జనం

Maruti Brezza @ Rs 3 Lakhs: మన దేశంలో మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి బ్రెజ్జా సబ్ కాంపాక్ట్ SUV ఒకటి. దీని మారుతి సుజుకి విటారా బ్రెజ్జా అని కూడా పిలుస్తారు. ఈ కారును 2016లో మన దేశంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అత్యంత ప్రజాదరణతో దీని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది కొత్త మోడల్ ఆవిష్కరించారు. దీనికి సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు యాడ్ చేశారు. ఈ ఫీచర్లు యాడ్ చేసిన తరువాత వీటి అమ్మకాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో SUV టాప్‌లో నిలిచింది. సరసమైన ధరలో కారు కోసం చూస్తున్న వారికి మారుతి బ్రెజ్జా మంచి ఎంపిక. కేవలం రూ.3 లక్షలకే ఈ SUVని ఇంటికి తీసుకువెళ్లండి.

 మారుతి బ్రెజ్జా ధర ఎంతంటే..?

ఈ సబ్‌కాంపాక్ట్ SUV ధర రూ.8.19 లక్షల నుంచి రూ.14.04 లక్షల వరకు ఉంటుంది. ఇది నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది: LXi, VXi, ZXi, ZXi+. మారుతి దీనిని ఆరు మోనోటోన్, మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌లో అందిస్తుంది. ఈ కారులో ఐదుగురు కూర్చునేందుకు అవకాశం ఉంటుంది. సబ్ కాంపాక్ట్ SUV 328 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. మీరు ఈ కారును లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే.. రూ.3 లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించి కూడా సొంతం చేసుకోవచ్చు.  
 
మీరు కారు బేస్ వేరియంట్ (బ్రెజ్జా ఎల్‌ఎక్స్‌ఐ) కోసం వెళితే.. ఆన్‌రోడ్‌లో రూ.9.26 లక్షలు అవుతుంది. లోన్‌పై తీసుకుంటే.. వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు భిన్నంగా ఉంటుంది. లోన్ కాలపరిమితి 1 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా ఎంచుకోవచ్చు. 

ఉదాహరణకు.. రూ.3 లక్షల డౌన్ పేమెంట్, 10 శాతం వడ్డీ రేటు, 5 సంవత్సరాల రుణ కాలవ్యవధి అనుకుందాం.. మీరు ప్రతి నెలా రూ.13,313 ఈఎంఐ చెల్లించాలి. మీరు లోన్ మొత్తానికి (రూ.6.26 లక్షలు) అదనంగా రూ. 1.72 లక్షలు చెల్లిస్తారు. 

మారుతి బ్రెజ్జా ఫీచర్లు ఇవే..

ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, పాడిల్ షిఫ్టర్స్ (AT వేరియంట్), సింగిల్-పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-హోల్డ్ అసిస్ట్, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.

Also Read: TSPSC Paper Leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక మలుపు.. గ్రూప్ 1 పేపర్ కూడా లీక్..?

Also Read: Ex Minister Vijaya Rama Rao: మాజీ మంత్రి కన్నుమూత.. టీఆర్ఎస్‌ ఏర్పాటుకు కారణం ఆయనే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News