Vijayashanthi: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి హాట్ కామెంట్స్ చేశారు. తనను పక్కకు పెట్టారని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. దీనిపై బీజేపీ నేతలనే అడగాలన్నారు. హైదరాబాద్‌లో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. తాను అసంతృప్తిగా ఉన్నానో లేదో రాష్ట్ర బీజేపీ నాయకత్వం వద్దే స్పష్టత తీసుకోవాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మాట్లాడుదామనుకున్నానని ఐతే లక్ష్మణ్‌ వచ్చి మాట్లాడారని తెలిపారు. ఆయన వచ్చారు వెళ్లారని..తానకేమి అర్థం కావడం లేదని చెప్పారు. తన సేవలను ఎలా ఉపయోగించుకుంటారో బండి సంజయ్, లక్ష్మణ్‌కే తెలియాల్సి ఉందని విమర్శించారు. పార్టీ బాధ్యతలు ఇస్తే ఏమైనా చేయగలమని..ఏమి ఇవ్వకుండా చేయాలంటే ఇలా అని ప్రశ్నించారు. తన పాత్ర ఎప్పుడు టాప్‌లోనే ఉంటుందని స్పష్టం చేశారు.


ఉద్యమ నేతగా ప్రజల్లో ఉన్నానని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో పోరాడానని..తన పాత్ర ఎప్పుడు బాగానే ఉంటుందన్నారు. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బాగుంటుందని హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం విజయ శాంతి వ్యాఖ్యలు బీజేపీలో కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో పుంజుకోవాలని అనుకుంటున్న సమయంలో నేతల మధ్య సమన్వయ లోపం బయటపడుతోంది.


పార్టీలో కొందరి నేతల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కావాలనే కీలక నేతలను దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్‌, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈతరుణంలో ఆ పార్టీ నేత విజయ శాంతి వ్యాఖ్యలు సెగలు పుట్టిస్తున్నాయి. ఆమె పార్టీ మారుతున్నారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి. విజయ శాంతి తిరిగి సొంత గూటికి చేరుతారన్నప్రచారం జరుగుతోంది.


ప్రస్తుతం మునుగోడు సభపై బీజేపీ ఫోకస్‌ చేసింది. ఈసభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కమలం గూటికి చేరనున్నారు. త్వరలో ఆ స్థానానికి ఉప ఎన్నిక రానుంది. ఈనేపథ్యంలో మునుగోడు స్థానానికి దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. రానున్న రోజుల్లో కీలక నేతలు పార్టీకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


Also read:Constable Hall Ticket 2022: తెలంగాణలో కానిస్టేబుల్ రాత పరీక్షకు అంతా రెడీ..హాల్ టికెట్లు ఇలా పొందండి..!


Also read:Farmers Protest: లఖింపుర్‌ఖేరీలో ఉధృతమవుతున్న రైతు ఉద్యమం..న్యాయం చేయాలని డిమాండ్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook