Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంంగ్రెస్ లో వర్గ పోరు కంటిన్యూ అవుతోంది. హైకమాండ్ ఎంతగా చెప్పినా సీనియర్ నేతల తీరు మారడం లేదు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్ గా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన పార్లమెంట్ పరిధిలోనే మునుగోడు నియోజకవర్గం ఉన్నా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. పార్టీ నుంచి తనను పంపించి వేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. చండూరు సభలో తనను కావాలనే అసభ్యంగా తిట్టించారని చెప్పారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక విషయంలో పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాల గురించి తనతో ఎవరూ మాట్లాడటం లేదన్నారు కోమటిరెడ్డి. తనకు పార్టీలో జరుగుతున్న అవమానాలపై పార్టీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. జానారెడ్డికి ఇంటికి వెళ్లిన పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తన ఇంటికి ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ చేత కొంత మంది పెద్దలు కావాలనే తనను అసభ్యంగా మాటలతో తిట్టించారని కోమటిరెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న తనను పార్టీ సభలో అవమానించారని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.చండూరు సభలో తనపై చేసిన కామెంట్లతో తనకు నిద్రే పట్టడం లేదన్నారు.
పార్టీలో సీనియర్ అయిన తనను రేవంత్ రెడ్డి హోంగార్డుతో పోల్చారని.. రాబోయే మునుగోడు ఉప ఎన్నికలో ఆ ఐఏఎస్, ఐపీఎస్ లే గెలిపించాలని సవాల్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబులు కూడా సదరు నేత దృష్టిలో హోంగార్డులేనా అని కోమటిరెడ్డి అన్నారు. తాను మిగతా వారిలా నాలుగైదు పార్టీలు మారలేదంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి. ఇకపై కూడా పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో ముందే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని విమర్శించారు. గత నాలుగు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని.. ఇప్పుడు ఓడిపోయినా ఏమీ కాదని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. బైపోల్ లో తప్పకుండా గెలుస్తామని చెప్పి కేడర్ లో జోష్ నింపాలి కాని.. ముందే ఓటమి గురించి చెప్పడం ఏంటని నిలదీశారు. పీసీసీ చీఫ్ ఉప ఎన్నికకు ముందు ఓడిపోయినా ఫర్వాలేదని చెప్పడం ద్వారా ఏం సంకేతం ఇచ్చారన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తులపై పార్టీపై ప్రేమ ఉండదన్నారు. అందుకే చిల్లర మాటలతో పార్టీని బొంద పెడుతున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Naga Chaitanya: విజయ్ సేతుపతి, నాని కాదనుకున్న పాత్ర చేసి డిజాస్టర్.. పాపం చైతూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.