Etela Rajender Fires on CM KCR: ప్రజలకి సేవ చేయడానికి ఆరు ఫీట్లు, రంగు అక్కరలేదని.. మంచి మనసు ఉంటే చాలు అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఈ రోజు గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి మోదీ ఇచ్చిన డబ్బులతోనే జరిగిందని.. కేసీఆర్ తాను చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. లక్షా 20 వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారని.. మూడేళ్లలో కుంగిపోయిందని విమర్శించారు. ఢిల్లీ నిపుణులు రిపేర్ చేయడం కూడా కష్టమే అని చెబుతున్నారని.. తెలంగాణ ప్రజలకు మళ్లీ కరువే మిగిలిందన్నారు. భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గ  బీజేపీ అభ్యర్ధి చందుపట్ల కీర్తిరెడ్డి తరపున ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"బీజేపీ వస్తే పుస్తెల తాళ్తు డాక్టర్ల కాళ్ల మీద పెట్టి భర్తకు వైద్యం చేయమని అడిగే దుస్థితి లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తాం. పేదలకు ఉన్నత విద్యను దూరం చేసిన దుర్మార్గుడు కేసీఆర్. బీజేపీ వస్తే ఉస్మానియా నుంచి అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రైవేట్ కంటే మంచి విద్య అందిస్తాం. ఒకప్పుడు సింగరేణిలో మట్టి తీసే పని మాత్రమే కాంట్రాక్టుకు ఇచ్చేవారు ఇప్పుడు బొగ్గు, మట్టి అన్నీ ప్రైవేటుపరం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు 63 వేల మంది కార్మికులు ఉంటే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చి ఉద్యోగాలు 40 వేలకు పడిపోయేలా చేశాడు కేసీఆర్. బీజేపీ వస్తే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పరంగానే సింగరేణి వ్యవస్థను నడుపుతాం. 
 
బీజేపీ రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం. ఒక్క ఓటు వేయండి.. ముసలి వాళ్లిద్దరికీ పెన్షన్ అందిస్తాం. మహిళల రుణాల కింద 4 వేల 800 కోట్ల రూపాయలను కేసీర్ ఎగ్గొట్టాడు. వాటిని కట్టే బాధ్యత మాది. మహిళలకు ఇన్సూరెన్స్ స్కీముల డబ్బులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. పేద కుటుంబంలో ఎవరు చనిపోయినా.. ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీం అమలు చేస్తాం. రాష్ట్రంలో పేదలకు అందుతున్న రేషన్ బియ్యం ప్రతిగింజ మోడీ గారు ఇస్తున్నారు. కానీ కేసీఆర్ సొమ్మొకడిది సోకు ఒకరిదిల వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం  ఆ కుటుంబం వారే ముఖ్యమంత్రులుగా ఉంటారు. 


నేను దుఃఖమెంటో, ఆకలేంటో అనుభవించి వచ్చాను. మాలాంటి వారికి అధికారమిస్తే దానికి పరిష్కారం చూపిస్తా. కేసీఆర్‌ను ఓడించే సత్తా శక్తి ఈటల రాజేందర్‌కు ఉందని బీజేపీ అక్కడ నాకు టికెట్ ఇచ్చింది. నిన్న గజ్వేల్‌లో నామినేషన్ వేశాను. గజ్వేల్ జన ప్రభంజనం అయింది. 40 వేల మంది వచ్చారు. అంత జనం వస్తారని నేను కూడా ఊహించలేదు పరేషాన్ అయ్యాను. వారంతా కేసీఆర్ బాధితులు.. నేను కూడా కేసీఆర్ బాధితుడినే.. వారికి నేను నాయకత్వం వహిస్తున్నాను.." అని ఈటల రాజేందర్ అన్నారు.


Also Read: World Cup 2023 Semifinal Teams: పాక్ వర్సెస్ ఆఫ్ఘన్ వర్సెస్ కివీస్ 4వ సెమీస్ ఎవరిది


Also Read: NBK109: గొడ్డలికి కళ్ళజోడు.. మన బాలయ్య కు మరో బ్లాక్ బస్టర్ షురూ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి